Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Nov-2015 14:49:46
facebook Twitter Googleplus
Photo

మాస్ మహరాజా రవితేజ నటించిన బెంగాల్ టైగర్ రిలీజ్ కు రెడీ అవుతుండగానే.. మరో మూవీ మొదలుపెట్టేశాడు. ఎవడో ఒకడు టైటిల్ పై తెరకెక్కనున్న ఈ చిత్రానికి.. ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమాకి.. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్స్ జోరుగా సాగుతున్నాయి.

ఎవడో ఒకడులో నటీనటుల విషయంలో ఆసక్తికరమైన ఎంపిక జరుగుతోంది. ఈ మూవీలో విలన్ రోల్ కి చాలా ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. అందుకే రవితేజతో కిక్ లో సందడి చేసిన శ్యాం ని.. మరోసారి నెగిటివ్ రోల్ కు తీసుకున్నారు. రవితేజ్ - శ్యాం పోటాపోటీగా నటించిన కిక్.. సెన్సేషనల్ విక్టరీ సాధించింది. మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ కానుందని అంతకు మించిన కాంపిటీటివ్ సీన్స్.. ఎవడో ఒకడులో ఉంటాయని తెలుస్తోంది.

ఈ సినిమాలో మళయాళీ భామ అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్ - రావు రమేష్ లు కీలకపాత్రలు పోషించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి పవర్ ఫుల్ మ్యూజిక్ అందించనున్నాడు.

,  ,  ,  ,