Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Jul-2017 16:26:09
facebook Twitter Googleplus
Photo

సినీ పరిశ్రమలో తనకు వ్యతిరేకంగా అనేక కుట్రలు జరిగాయని అంది ఒకప్పటి శృంగార తార షకీలా. మలయాళ హీరోలే కాక.. హీరోయిన్లు కూడా తనను చూసి అసూయ చెందేవారని ఆమె చెప్పింది. తాను కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో కొందరు తనను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసినట్లుగా ఆమె వెల్లడించింది. తన కంటే ముందు శృంగార తారగా గుర్తింపు పొందిన సిల్క్ స్మిత తనపై అసూయతో ఒకసారి చేయి చేసుకుందని ఆమె వెల్లడించింది.

తాను.. సిల్క్ స్మిత కలిసి ఓ శృంగార చిత్రంలో నటించామని.. బెడ్ రూంలో తనను ఆమె కొట్టే సీన్ చేయాల్సి ఉండగా.. ముందుగా రిహార్సల్స్ చేద్దామని అడిగితే.. ‘షాట్ ఉన్నపుడు అదే వస్తుంది’ ఆమె చెప్పిందని.. తర్వాత తీరా షాట్ చేసేటపుడు తనను కావాలనే నిజంగా కొట్టిందని.. ఆ చిత్ర దర్శకుడితో తనకు అప్పటికే కొంచెం రిలేషన్ ఏర్పడిందని.. ఆ సంఘటనతో తాను అవమానంగా భావించి అక్కడి నుంచి వెళ్లిపోయానని షకీలా చెప్పింది. తన స్థానాన్ని నేనెక్కడ ఆక్రమించేస్తానో అన్న భయంతో.. అసూయతో సిల్క్ స్మిత తనను కొట్టిందని తాను ఇప్పటికీ అనుకుంటున్నట్లు షకీలా చెప్పింది. ఆ సంఘటన జరిగాక రెండు రోజుల పాటు షూటింగుకి వెళ్లలేదని.. తర్వాత ఇక స్మిత కాంబినేషన్లో నాకు సీన్లు లేవని చెప్పాక షూటింగ్ స్పాట్ కు వెళ్లానని.. కానీ అక్కడ ఆమె కారు కనిపించేసరికి వెనక్కి వెళ్లిపోదామనుకున్నానని.. ఐతే తనకు ఒక చాక్లెట్ బాక్స్ ఇచ్చి స్మిత కూల్ చేసిందని షకీలా వెల్లడించింది.

ఇక మలయాళ ఇండస్ట్రీ నుంచి తనకు వచ్చిన బెదిరింపుల గురించి చెబుతూ.. తాను కోచ్చిలో ఒక షోలో పాల్గొనడానికి ఓకే చెప్పానని.. కానీ ఆ షోకు బయల్దేరే ముందు తన ఇంటికి ఒక ఫోన్ కాల్ వచ్చిందని.. తాను వస్తే కాల్చి చంపేస్తామని బెదిరించారని షకీలా వెల్లడించింది. ఆ షోలో మరో హీరో కూడా పాల్గొనాల్సి ఉందని.. తనకున్న మాస్ ఫాలోయింగ్ దృష్ట్యా తాను వస్తే అతను తేలిపోతాడన్న ఉద్దేశంతో తనను అలా బెదిరించారని ఆమె చెప్పింది.

,  ,  ,  ,