Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Aug-2016 11:35:36
facebook Twitter Googleplus
Photo

ఈ ఏడాది వేసవి సీజన్లో 24 సినిమాతో క్లాస్ హిట్ కొట్టిన సూర్య, తాజాగా మాస్ హిట్ కొట్టేందుకు సింగమ్ 3 అనే సినిమాతో సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. తెలుగులో సూర్యకు తిరుగులేని స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టిన మాస్ సినిమాలైన సింగం(యముడు), సింగం 2(సింగం) సిరీస్‌లో మూడో సినిమాగా వస్తోన్న సింగం 3 ప్రస్తుతం సౌతిండియన్ సినిమాల్లో సెట్స్‌పై ఉన్న వాటిల్లో క్రేజ్ ఉన్న ఓ సినిమాగా చెప్పుకోవచ్చు. దీపావళి కానుకగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ ఈనెల 26 నుంచి మలేషియాలో మొదలుకానుంది.
చెన్నై, వైజాగ్ పరిసరాల్లో ఎక్కువభాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ పెద్ద ఎపిసోడ్ మలేషియా నేపథ్యంలో నడుస్తుందని , ఆ ఎపిసోడ్‌ సన్నివేశాలన్నీ ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నట్లు టీమ్ తెలిపింది. బిజినెస్‌ వర్గాల్లో ఎక్కడిలేని క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమా సుమారుగా 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయబోతోందని ట్రేడ్ అంచనా వేస్తోంది. స్టూడియో గ్రీన్ సంస్థతో కలిసి సూర్య సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో అనుష్క, శృతి హాసన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సింగం సిరీస్‌లో గత రెండు సినిమాలకు దర్శకత్వం వహించిన హరి, మూడో సినిమాకూ దర్శకత్వం వహిస్తున్నారు.

,  ,  ,  ,  ,