Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Jul-2016 15:39:33
facebook Twitter Googleplus
Photo

విక్టరీ వెంకటేష్, భలే భలే మగాడివోయ్‌ తో టాప్ దర్శకుల జాబితాలో చేరిపోయిన మారుతిల కాంబినేషన్‌లో ?బాబు బంగారం? అనే సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. టీజర్‌తో విపరీతమైన అంచనాలను రేకెత్తించిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుకను జూలై 9న జరపనున్నట్లు కొద్దిరోజుల క్రితం ప్రకటించిన టీమ్, తాజాగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆడియో విడుదలను వాయిదా వేసేసింది. గిబ్రాన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియోలో ఒక్క పాట మాత్రం 9వ తేదీన విడుదల కానుంది.
ఇక కొత్త ఆడియో విడుదల తేదీ ఎప్పుడనేది మరో వారం రోజుల్లో ప్రకటించనున్నారని తెలుస్తోంది. వెంకటేష్ సరసన నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. వెంకటేష్ ఈ సినిమాలో ఓ కామెడీ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

,  ,  ,  ,  ,  ,  ,