Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Nov-2015 17:50:38
facebook Twitter Googleplus
Photo

ఓకే బంగారం అంటూ దుల్కర్ సల్మాన్ - నిత్యామీనన్ మణిరత్నం దర్శకత్వంలో సహజీవనం చేసిన విషయం తెలిసిందే. అప్పటి వరకు వరుస పరాజయాలతో ఉన్న మణిరత్నం మళ్లీ ఈ సినిమా సక్సెస్ తో ఫామ్ లోకి వచ్చాడనే చెప్పాలి. తెలుగు - తమిళ ప్రేక్షకులను ఈ చిత్రం మెప్పించింది. అయితే ఈ చిత్రాన్ని ఎప్పుడో హిందీలో రీమేక్ చేద్దామనుకున్నాడు మణిరత్నం. కానీ మరో సినిమా చేద్దామనుకుని స్టార్ హీరోలకు కథలు చెప్పే పనిలో బిజీ అయిపోయాడు. ఆ మధ్య భారీ మల్టీస్టారర్ మూవీ తెలుగు - తమిళ భాషల్లో చేస్తున్నాడంటూ వార్తలు కూడా వచ్చాయి . కానీ అవేమీ కార్య రూపం దాల్చలేదు. ఫైనల్ గా ఓకే బంగారం చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసే పనిలో బిజీ అయిపోయాడు మణిరత్నం.

గతంలో కూడా మణిరత్నం చిత్రాలు హిందీలో కూడా రీమేక్ అయ్యాయి. అక్కడ కూడా దక్షిణాదిన ఆడినట్లే బాగా ఆడిన సినిమాలున్నాయి. బాలీవుడ్ లో కూడా మణిరత్నం కి మంచి పేరుంది. మొదట హిందీలో ఆదిత్యరాయ్ కపూర్ - శ్రద్ధాకపూర్ హీరోహీరోయిన్లుగా ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని భావించాడు. కానీ ఇప్పుడు శ్రద్ధాకపూర్ స్థానంలో సోనాక్షీ సిన్హాని తీసుకున్నట్టు సమాచారం. ఇటీవల ముంబయ్ లో జరిగిన ఓ ఫంక్షన్ లో స్వయంగా మణిరత్నం స్వయంగా ఈ విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. లివింగ్ రిలేషన్ షిప్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో సోనాక్షి సిన్హా కూడా నటించడానికి సుముఖుత కనబరుస్తున్నట్లు తెలుస్తోంది

,  ,