Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Nov-2017 14:07:26
facebook Twitter Googleplus
Photo

కొన్ని ప్రాజెక్ట్స్ మధ్యలోనే ఆగిపోయిన సంగతి చాలా మందికి తెలియదు. కొన్ని కథా చర్చల వల్ల ఆగిపోతే మరికొన్ని షూటింగ్ మధ్యలోనే ఆగిపోయాయి. ఇక కొన్నైతే విభేదాల వల్ల కూడా ఆగిపోయాయి. అయితే అదే తరహాలో విభేదాలు వస్తాయేమో అని ఓ మల్టి స్టారర్ మూవీ ఆగిపోయిందట. చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ న్యూస్ ప్రస్తుతం చాలా వైరల్ అయ్యింది.

రీసెంట్ గా గరుడవేగ సినిమాతో మంచి హిట్ అందుకొని ఫామ్ లోకి వచ్చిన రాజశేఖర్ ఈ మధ్యన వార్తల్లో బాగా నిలుస్తున్నారు. ఇంటర్వ్యూలలో కొన్ని ఘటనల గురించి చెబుతూ.. ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారుస్తున్నారు. ఇకపోతే రాజశేఖర్ - మోహన్ బాబు కలయికలో ఎడిటర్ మోహన్ ఒక సినిమాను నిర్మించాలని అనుకున్నారట. మళయాలం లో హిట్ అయిన తేంకాశీపట్నం అనే కథను కూడా ఒకే చేశారు. అయితే రాజశేఖర్ సినిమా షూటింగ్ లకు లేట్ గా వస్తారని అప్పట్లో టాక్ బాగానే ఉండేది. అయితే నిర్మత నటీనటులకు టెక్నీషియన్స్ కి అడ్వాన్స్ లు కూడా ఇచ్చేసి షూటింగ్ ని స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారట.

కానీ మోహన్ బాబు ఒకరోజు రాజశేఖర్ ని లంచ్ కి పిలిపించి షూటింగ్ కి కరెక్ట్ టైమ్ రావాలని చెప్పడంతో రాజేశేఖర్ ఆ తర్వాత తన అభిప్రాయాన్ని మార్చుకున్నారట. ఇద్దరి మధ్య రిలేషన్స్ లో తేడా రాకూడదని రాజశేఖర్ సినిమా నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది. అయితే వెంటనే మోహన్ వారి స్థానంలో జగపతి బాబు - అర్జున్ ని సెలెక్ట్ చేసి సినిమాను స్టార్ట్ చేశారు. అదే హనుమాన్ జంక్షన్.

,  ,  ,  ,