Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Aug-2015 16:54:07
facebook Twitter Googleplus
Photo

దీవర.. అంటూ బాహుబలి చిత్రంలో అవంతిక చేసిన హంగామా అంతా ఇంతా కాదు. శివుడిని పరవశంలో ముంచేసి పర్వతారోహణం చేయిస్తుంది. కొండలు వాగులు జలపాతాలు దాటుకుని ఎత్తయిన కొండల్ని ఎక్కేసేందుకు ఊతమందించేస్తుంది అవంతిక దివ్య రూపం. ఆ పాటలో గ్రాఫిక్స్ మాయాజాలం అసాధారణం. అవంతిక పాలనురుగు దేహశిరులపై కొన్ని సీతాకోక చిలుకలు పరుచుకుని కనిపించే ఓ షాట్ అద్భుతంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ముంబై ఫ్యాషన్ వీక్ లో ఆ సీతాకోకల డిజైన్ కూడా హైలైట్ అయిపోయింది. కాస్త డీటెయిల్స్ లోకి వెళితే..

ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ ఒంటిపై కనిపించేవి సీతాకోక చిలుకల్లా కనిపించడం లేదూ? ఆ డిజైన్ కి ఇన్స్పిరేషన్ బాహుబలి లోని అవంతిక అనిపించడం లేదూ? దీవర సాంగ్ లో అవంతిక బ్యాక్లెస్ స్టయిల్ లో ముందుకి సాగిపోతూ వెనక్కి తిరిగి చూస్తుంది. శివుడిని కవ్విస్తుంది. అతడు వెంటపడుతుంటాడు. భుజాల నుంచి కిందికి అంతా ఓపెన్ షో. అక్కడ వాలిన సీతాకోకలు చివరిలో ఎగిరిపోతాయనుకోండి. కానీ ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న సోనమ్ స్టయిల్ లో ఆ ఇన్ స్పిరేషన్ కనిపిస్తోంది. ముంబై ఫ్యాషన్ వీక్ లో సోనమ్ ఇలా బ్యాక్ లెస్ ఫోజులిచ్చి యువతరానికి చలిజ్వరం పుట్టించింది.

,  ,