Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Jun-2016 17:03:24
facebook Twitter Googleplus
Photo

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. టాలీవుడ్ కి సంబంధించినంత వరకూ ఈ పేరు ఓ ప్రభంజనం. డిజాస్టర్ సినిమాతో కూడా 50 కోట్ల మార్క్ ని అందుకోగల సంచలనం. కానీ అసలు పవన్ సినిమా ఎప్పుడొస్తుంది.. ఎప్పుడు షూటింగ్ లో పాల్గొంటాడు.. ఆ సినిమాని ఎవరు తీస్తారు.. లాంటి ప్రశ్నలు అడిగితే మాత్రం అభిమాని కాదు కదా.. పవన్ పక్కనే ఉండే సన్నిహితులు కూడా చెప్పలేరు.

సర్దార్ గబ్బర్ సింగ్ ను మొదలుపెట్టినపుడు సంపత్ నందితో ఏడాదికి పైగానే జర్నీ చేసిన పవర్ స్టార్.. చివరకు ఆ సినిమాని బాబీతో పూర్తి చేయించాడు. అలాగే హీరోయిన్ గా ముందు అనీషా ఆంబ్రోస్ ని హీరోయిన్ గా అనుకుని.. చివరకు కాజల్ అగర్వాల్ ని ఫైనల్ చేశారు. ఇప్పుడు మళ్లీ కొత్త స్టోరీ మొదలైంది. టైటిల్ ఇంకా డిసైడ్ చేయని ఫ్యాక్షనిస్ట్ ప్రేమకథకి.. ఎస్ జే సూర్యని మొదట డైరెక్టర్ అన్నాడు పవన్. ఇప్పుడు ఏవేవో కారణాలతో.. ఆ ప్లేస్ లోకి డాలీని పట్టుకొచ్చాడు.

ఇప్పటికైతే అధికారికంగా అనౌన్స్ చేయకపోయినా పవన్ నెక్ట్స్ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ అంటున్నారు. ఇప్పుడు డైరెక్టర్ మారాడు కాబట్టి టేస్ట్ మారిందంటూ.. హీరోయిన్ ని కూడా రీప్లేస్ చేస్తే పరిస్థితి ఏంటి అనుకుంటున్నారు అభిమానులు. ఇప్పటికే డైరెక్టర్ మార్పు కారణంగా సర్దార్ తో పోల్చేందుకు ఒక లింక్ వచ్చింది. ఇక హీరోయిన్ ని కూడా మార్చేస్తే.. మళ్లీ ఫ్యాన్స్ కి సర్దార్ రోజులు గుర్తు రావడం ఖాయమే

,  ,  ,  ,  ,  ,  ,