Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Oct-2015 15:40:10
facebook Twitter Googleplus
Photo

బాలీవుడ్ లో ఫ్యాషన్ ఐకన్ గా పాపులర్ అయ్యింది సోనమ్ కపూర్. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ని ఫాలో అవుతూ యువతరంలో నిత్యం హాట్ టాపిక్ అవుతోంది అమ్మడు. ఓ రకంగా సినిమాలతో కంటే ఇతరత్రా వ్యవహారాలతోనే ఎక్కువగా చర్చల్లోకి రావడం ఈ అమ్మడి స్టయిల్. చూడటానికి పక్కింటి అమ్మాయిలా ఉంటూనే అందాల ఆరబోతలో ఫారిన్ పాప్ సింగర్లను కొట్టేసే రేంజులో ఉంటుంది. పబ్బుకెళ్లినా - క్లబ్బుకెళ్లినా - షాపు కెళ్లినా - జిమ్ముకెళ్లినా అక్కడి నుంచి సెల్ఫీలు దిగి వాటిని ఇన్ స్టాగ్రమ్ - ట్విట్టర్ లో పెట్టి అభిమానుల్లో క్రేజు సంపాదించుకుంటుంది. నిరంతరం యూత్ డిష్కసన్స్ లో నలుగుతుంటుంది.

ఇదిగో ఇలా నడువొంపుల్ని - మేని సొగసుల్ని వయ్యారంగా చూపిస్తున్న ఫోటోని ఇన్ స్టాగ్రమ్ లో పోస్ట్ చేసి కుర్రకారును టెంప్ట్ చేస్తోంది. మజ్జారే మచ్చారే .. చూశారా నా పరువాల్ని? చూస్తున్నారా నా జిమ్మింగ్ స్టయిల్? అంటూ ఇలా ఫోజులిచ్చింది అమ్మడు. రెడీ టు కిల్ ఇట్ అంటూ కుర్రాళ్లను కిల్ చేస్తోంది. అసలే నాజూకు దేహశిరులు.. వాటిని అతుక్కు పోయిన ఆ టైట్ ఫిట్ స్పోర్ట్స్ వేర్ కిక్కెక్కించడం లేదూ. ఆ నడుము వయ్యారం సన్నజాజి సొగసుల్ని ఆవిష్కరించడం లేదూ? అయినా ఇలా కుర్రాళ్లను టెంప్ట్ చెయ్యడం అవసరమా ఓ అమ్మడూ? వచ్చే దీపావళికి అమ్మడు ఎథినిక్ లుక్ లో 'ప్రేమ్ రతన్ థన్ పాయో' సినిమాతో సందడి చేయనున్నా కూడా.. ఇప్పుడు మాత్రం ఇలా మోడ్రన్ లుక్ తో కిక్ తెప్పిస్తోందనమాట.

,  ,  ,