Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Jul-2015 12:38:22
facebook Twitter Googleplus
Photo

తమిళ తెరపై మెరిసిన అందాల కథానాయికలలో సోనియా అగర్వాల్ ఒకరు. తమిళ్లో రూపొందించిన '7G రెయిన్ బో కాలని' చిత్రం తెలుగులో '7G బృందావనం కాలని' పేరుతో వచ్చి ఘనవిజయాన్ని సాధించింది. ఈ సినిమాతో సోనియా ఇక్కడి కుర్రకారుని ఎంతగానో ప్రభావితం చేసింది. తమిళ్లో బిజీ అయిన సోనియా హీరో ధనుష్ సోదరుడైన దర్శకుడు సెల్వరాఘవన్ ని వివాహం చేసుకుంది. ఆ తరువాత మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోయారు.

సెల్వరాఘవన్ మరో పెళ్లి చేసుకున్నాడు .. ఇక ఆ గాయం మానిపోయింది కనుక తాను కూడా పెళ్లిచేసుకోవాలని అనుకుంటున్నట్టుగా సోనియా అగర్వాల్ చెబుతోంది. అంతేకాదు .. దర్శకుడు సెల్వరాఘవన్ భార్యకి అభ్యంతరం లేకపోతే ఆయన సినిమాల్లో నటించడానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదనీ, అలాగే ఆయన సోదరుడైన ధనుష్ సినిమాల్లో నటించడానికి కూడా తనకి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చింది. తమిళ్లో సంగతి అటుంచితే 'టెంపర్' సినిమా తరువాత ఆమెకి తెలుగులో అవకాశాలు బాగానే వస్తున్నాయట. ఇక ఇక్కడ తల్లి పాత్రలతో .. అత్తపాత్రలతో బిజీ అవుతుందేమో చూడాలి.

,  ,