Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Jul-2017 11:53:53
facebook Twitter Googleplus
Photo

నిప్పు లేకపోయినా అక్కడ గుప్పు గుప్పున పొగ వచ్చేస్తుంటుంది. అందుకే రిలేషన్స్ గురించి ఎఫైర్స్ గురించి బోలెడన్ని కబుర్లు వినిపిస్తుంటాయి. వాటిని జనం కూడా ఎంతో ఆసక్తిగా వింటుంటారు. కానీ తారలే వాటి విషయంలో గుస్సా గురవుతుంటారు. ఏమీ లేనిదే ఎందుకలా చేస్తున్నారంటూ మండిపోతుంటారు. ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చింది కాబట్టి తమపై ఏదొచ్చినా వెంటనే ట్విట్టర్ ద్వారానో ఫేస్ బుక్ ద్వారానో రియాక్ట్ అవుతూ ఖండిస్తుంటారు. ఆ గాసిప్పుల్లో నిజం లేదన్న విషయం అప్పుడైనా జనానికి తెలిసిపోతుంది. కానీ ఇదివరకు అలా కాదు. ఒక్కసారి గాసిప్పు బయటికొచ్చిందంటే దానిపై తారలు ప్రత్యక్షంగా క్లారిఫై ఇచ్చేంతవరకు జనాల మనసుల్లో అలాగే ఉండిపోయేది.

తాజాగా కుర్రభామ సోనమ్ కపూర్ ఎంగేజ్మెంట్ పై వచ్చిన ఓ పుకారు ఆమెని చాలా హర్ట్ చేసేసినట్టుంది. దాంతో ట్విట్టర్ వేదికగా ఊగిపోయింది. నా సన్నిహితులు చెప్పారంటూ ఏదేదో రాస్తున్నారు నా గురించి మీకు చెప్పినవాళ్లంతా నా సన్నిహితులేనా? ఏదైనా విషయం ఉంటే నేనే చెబుతాను కదా అంటూ మండిపడిందామె. ఇంతకీ ఆమె గురించి వచ్చిన వార్తేంటో తెలుసా? ఓ ప్రముఖ వ్యాపారితో సోనమ్ పెళ్లి కుదిరిందని ఆయనతో ఇప్పటికే ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందని! కానీ సోనమ్ మాత్రం అదేం లేదు నా ఎంగేజ్మెంట్ పెళ్లి గురించి నేనే స్వయంగా ప్రకటిస్తా... మీకెందుకు తొందర అని చెప్పుకొచ్చింది. సోనమ్కి చాలా మందే మద్దతుగా నిలిచారు. దాంతో మరింత రెచ్చిపోయిన ఆమె ఇలాంటి వార్తల్ని రాసే జర్నలిస్టులు కూడా అమ్మాయిలే కావడం మరింత విడ్డూరం. అమ్మాయిల జీవితాల్లో రింగు ఫింగర్ కి ఉన్న ప్రాధాన్యం వాళ్లకి తెలియంది కాదు కదా. కానీ ఉన్నది లేనిది... లేనిది ఉన్నట్టు ఎందుకు రాస్తారో తెలియదు అని వ్యాఖ్యానించింది.

,  ,  ,  ,  ,