Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Nov-2016 11:19:04
facebook Twitter Googleplus
Photo

ఒక సినిమా విడుదలకు ముందురోజు ఆ సినిమాకు పనిచేసిన వారందరి హృదయస్పందన ఎంత వేగంగా కొట్టుకుంటుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొన్ని నెలల కష్టం కేవలం కొన్ని గంటల వ్యవధిలో రెండున్నర గంటల నిడివి ద్వారా ఫలితం వచ్చేస్తుంది. ఈ టైపు టెన్షన్ నిన్నంతా నిఖిల్ భరించినట్టు తెలుస్తుంది.

తన సినిమా ఎక్కడికి పోతావు చిన్నవాడా ఈరోజు విడుదలకానుండడంతో విష్ చేసిన సెలబ్రిటీలకు థాంక్స్ చెబుతూ ఎంతో టెన్షన్ పడుతున్నట్టు ప్రకటించాడు. రాత్రి నిద్ర కూడా పట్టదేమో అని కొంతమందికి రీప్లే ఇవ్వడం విశేషం. అయితే కొసమెరుపు ఏమిటంటే సంపూర్ణేష్ బాబు నిఖిల్ చిత్రాన్ని విష్ చేస్తూ వేసిన ట్వీటుకి బదులుగా నిఖిల్ కృతజ్ఞతలు చెబుతూ మీ ఫ్యాన్స్ అంతా కలిసి ఒక్కసారి నా సినిమాను చూసినా చాలు ఇక లాభాలే లాభాలని చమత్కరించాడు.

ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాని వి.ఐ ఆనంద్ తెరకెక్కించాడు. ఆత్మాన్వేషణలో సాగే కథతో నిఖిల్ మరోసారి మెప్పించనున్నాడు.

,  ,  ,  ,  ,