Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Sep-2017 10:41:01
facebook Twitter Googleplus
Photo

గతంలో చాలామంది తాము డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని చెప్పేవాళ్లు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. వేర్వేరు ప్రొఫెషన్స్ నుంచి వచ్చిన వాళ్లు కూడా సినీ ఫీల్డ్ లో బాగా రాణించేస్తున్నారు. ముఖ్యంగా స్పోర్ట్స్ పర్సనాలిటీస్ గా వెలిగిపోయిన వారు కూడా తెరపై తమ ప్రతిభను చాటుకుంటున్నారు.

గురు చిత్రంలో నటించిన రితికా సింగ్.. నేషనల్ లెవెల్ కిక్ బాక్సర్ మాత్రమే కాదు.. మార్షల్ ఆర్ట్స్ ఎక్స్ పర్ట్ కూడా. ఇప్పుడు సినిమాల్లో నటిస్తున్నా.. ఆటలను పక్కన పెట్టే సమస్యే లేదని ఈమె చెబుతోంది. రోండా రౌజీనే తనకు స్ఫూర్తి అన్న ఈమె.. ఫైటర్ గా కెరీర్ కంటిన్యూ చేస్తూనే.. సినిమాల్లో సూపర్ స్టార్ గా ఎదిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటోంది. ఇక పుల్లెల గోపీచంద్ బయోపిక్ లో నటిస్తున్నాడు హీరో సుధీర్ బాబు. నిజానికి సుధీర్ బాబు ఓ నేషనల్ లెవెల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కావడం విశేషం. అందుకే తన పాత్రకు సుధీర్ బాబు సరిగ్గా సరిపోతాడని గోపీచంద్ అంటున్నారు.

సెక్సీ బ్యూటి రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. అయితే.. ఈమె ఒక ప్రొఫెషనల్ గోల్ఫ్ ప్లేయర్ అనే సంగతి చాలా మందికి తెలియదు. తండ్రి గైడెన్స్ తో తనకు పెద్దగా ప్రపంచం గురించి తెలియకముందే గోల్ఫ్ లో ఆరితేరానని చెబుతోంది రకుల్. అయితే 19 ఏళ్ల వయసు వచ్చాకే మోడలింగ్ లోకి అడుగు పెట్టేందుకు అనుమతి ఇస్తానని తండ్రి చెప్పడంతో.. అప్పటివరకూ గోల్ఫ్ విపరీతంగా ఆడేదిట రకుల్. ఇప్పుడు కూడా ఆదివారాల్లో గోల్ఫ్ ఆడతానని చెబుతోంది.

యాక్టర్ కం డైరెక్టర్ గా శ్రీనివాస్ అవసరాల బోలెడంత గుర్తింపు సంపాదించుకున్నాడు. రాకెట్ బాల్ ప్లేయర్ అయిన ఇతను.. 2014లో సౌత్ కొరియాలో జరిగిన ఆసియా ఓపెన్ వరల్డ్ రాకెట్ బాల్ ఛాంపియన్ షిప్ లో కూడా పాల్గొన్నాడు. రాకెట్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో కూడా శ్రీనివాస్ అవసరాల ఉండడం విశేషం. స్టడీస్ టైం నుంచి ఈ స్పోర్ట్ పై ఇంట్రెస్ట్ ఉండగా.. యాక్టింగ్ తో పాటు ఈ కెరీర్ కూడా కంటిన్యూ చేశానని చెబుతున్నాడీ హీరో. కంచె షూటింగ్ సమయంలో కుడి అరచేతికి దెబ్బ తగలడంతో గేమ్ ను పక్కన పెట్టాల్సి వచ్చిందట.

హీరో నాగ శౌర్య నేషనల్ లెవెల్ టెన్నిస్ ప్లేయర్ అనే సంగతి చాలా మందికి తెలియదు. హీరోయిన్ మెహ్రీన్ కౌర్ అయితే ఎయిర్ పిస్టల్ షూటింగ్ లో ప్రీ నేషనల్స్ వరకూ వెళ్లింది కూడా.

,  ,  ,  ,  ,