Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Jun-2017 15:34:12
facebook Twitter Googleplus
Photo

కొన్ని సినిమాలు కలెక్షన్లు తెచ్చిపెట్టకపోయినా మేకర్లకు మంచి పేరు ప్రతిష్ఠలు గౌరవాన్ని తీసుకొస్తాయి. దర్శకుడు వంశీ పైడిపల్లికి ఇలా మంచి పేరు తెచ్చిపెట్టిన చిత్రం ఊపిరి. నాగార్జున - కార్తి ప్రధాన పాత్రధారులుగా తీసిన ఈ చిత్రం కమర్షియల్ గా అనుకున్న స్థాయిలో వసూళ్లు తెచ్చిపెట్టలేదు. కానీ నాగార్జున యాక్టింగ్ కు - వంశీ పైడిపల్లి దర్శకత్వానికి మంచి మార్కులే పడ్డాయి. వీల్ చైర్ కే పరిమితమైపోయిన మల్టీ మిలియనీర్ - అతడికి సహాయంగా ఉండేందుకు వచ్చిన ఓ సాధారణ యువకుడి మధ్య ఏర్పడిన అనుబంధం అన్న పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ప్రెంచి సినిమాకు ఇది అఫీషియల్ రీమేక్ అయినప్పటికీ ఎక్కడా ఆ ఫీల్ రాకుండా నేటివిటీ టచ్ ఉండేలా సినిమా తీసిన తీరు మంచి ప్రశంసలందుకుంది.

‘ఊపిరి’ సినిమాకు బెస్ట్ డైరెక్టర్ గా వంశీ పైడిపల్లికి ఫిలిం ఫేర్ అవార్డు వరించింది. వంశీ ఈ అవార్డు అందుకోవడం మొదటిసారి. ఫిలిం ఫేర్ అవార్డు ఫంక్షన్ పాసుల కోసం క్యూలో ఎదురుచూసిన తాను ఈ అవార్డు అందుకోవడం మరిచిపోలేని అనుభూతి అని వంశీ చెప్పాడు. ‘నా మనస్సుకు ఎంతో దగ్గరైన సినిమా ఇది. ఫిలిం మేకర్ గా ఊపిరి సినిమా నా బాధ్యతను మరింత పెంచింది. అన్నివైపుల నుంచి నాకు ఎంతో గౌరవం తెచ్చిపెట్టిన సినిమా ఇది. ఈ సినిమా రిలీజైన తర్వాత అందుకున్న కొన్ని కాల్స్ - మెసేజెస్ నన్ను ఎంతగానో కదిలించివేశాయి అంటూ వంశీ పైడిపల్లి చెప్పుకొచ్చాడు.

జీవితంలో ఎన్నో విజయాలు సాధించిన వారిలో కూడా సంతోషం కనిపించదు. సంతోషాన్ని ఎక్కడో వెతుక్కుంటూ ఉంటారు. అది మనలోనే దాగుందనే విషయాన్ని గుర్తించరు. ఊపిరి సినిమాతో నేను ఈ విషయం తెలుసుకోగలిగాను. జీవితాన్ని కొత్త కోణం నుంచి చూడగలిగాను అంటూ ఊపిరి సినిమా వ్యక్తిగతంగా తనలో తెచ్చిన మార్పును వివరించాడు వంశీ పైడిపల్లి.

,  ,  ,  ,  ,