Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Sep-2017 11:04:49
facebook Twitter Googleplus
Photo

ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పాత్రలో ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులంతా ఎన్నాళ్లుగానో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుదీర్ఘ కాలంపాటు షూటింగ్ జరుపుకొన్న ఈ మూవీ ఎట్టకేలకు సెప్టెంబర్ 27న థియేటర్లకు రానుంది. రిలీజ్ డేట్ కు టైం దగ్గర పడుతుండటంతో డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ షూటింగ్ కు సంబంధించిన పెండింగ్ పనులు చకచకా పూర్తి చేసే పనిలో పడిపోయాడు.

ఈలోగా స్పైడర్ సినిమాకు సంబంధించి కొంత పార్ట్ లీకయిందంటూ టాక్ బయటికొచ్చింది. పోస్టు ప్రొడక్షన్ సమయంలో ఈ సినిమాలో కొంత పార్ట్ లీకయిందనే మాట తక్కువ టైంలోనే వైరల్ గా మారిపోయింది. సోషల్ మీడియాలోనూ ఈ విషయంపై విపరీతమైన డిస్కషన్ నడిచింది. దీనిపై సినిమా యూనిట్ వెంటనే స్పందించింది. స్పైడర్ ఫుటేజ్ లీకయిందని వస్తున్న ఎటువంటి రూమర్లను నమ్మవద్దు. ఫేక్ వీడియోలు పెడుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిలిం మేకర్స్ ట్విట్టర్ లో అఫీషియల్ గా స్టేట్ మెంట్ ఇచ్చారు. దీంతో అభిమానులంతా హ్యాపీగా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం స్పైడర్ యూనిట్ రొమేనియాలో ఉంది. అక్కడ హీరో మహేష్ అండ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పై డ్యూయట్ చిత్రీకరిస్తున్నారు.

కొత్త సినిమాలకు లీకుల బెడద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది నుంచి మొదలైంది. ఆ తర్వాత రాజమౌళి ప్రెస్టీజియస్ గా నిర్మించిన బాహుబలికి సంబంధించిన కొన్ని క్లిప్పింగులు రిలీజ్ కు ముందే నెట్ లో ప్రత్యక్షమయ్యాయి. అప్పటి నుంచి ఫిలిం మేకర్స్ లీకేజీల విషయంలో చాలా పకడ్బందీగా ఉంటున్నారు. అందుకే స్పైడర్ యూనిట్ సినిమా లీకవలేదని అంత గ్యారెంటీగా చెప్పగలిగారు.

,  ,  ,  ,  ,