Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Apr-2017 10:14:47
facebook Twitter Googleplus
Photo

ఇప్పుడు లావణ్య త్రిపాఠి బాగా ఎక్సయిటింగ్ గా ఉంది. ఆమె నటించిన మిష్టర్ సినిమా రిలీజవ్వడం ఒకెత్తయితే.. మరోవైపు ఆమె ప్రస్తుతం షూటింగులో పాల్గొంటున్న నాగచైతన్య సినిమా. కళ్యాణ్ కృష్ణ డైరక్షన్లో రారండోయ్ వేడుక చూద్దాం అంటూ రూపొందుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ మరియు లావణ్య త్రిపాఠిలు పోటాపోటీగా నటిస్తున్నారు.

తొలి సినిమా దెబ్బకు ఇప్పటివరకు లావణ్య త్రిపాఠిని అందరూ వోణీల్లోనే ఎక్కువగా చూపించారు కాని.. ఈ సినిమాలో మాత్రం దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మోడ్రన్ లుక్కులో చూపిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ స్పాటు నుండి ఇప్పుడు ఒక ఫోటో బయటకు వచ్చింది. ఫోటోను చూస్తే చెప్పేయవచ్చు.. అసలు లావణ్య ఈ సినిమాలో ఎంత గ్లామరస్ గా కనిపించనుందో. చిట్టిపొట్టి నిక్కర్లలో.. భుజాల దగ్గరకు దిగిపోయిన టాపుల్లో.. అబ్బో చాలా హాటుగా తన సోయగాలను ఆరబోస్తోందీ సుందరి. ఈ సినిమా దెబ్బతో అందాల రాక్షసి ఎఫెక్ట్ పోతుందేమోలే.

ఇకపోతే లావణ్య ఆల్రెడీ తాను అల్ట్రా గ్లామరస్ పాత్రలను పోషించడానికి సిద్దంగా ఉన్నట్లు ఎప్పుడో చెప్పేసింది.

,  ,  ,  ,