Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-May-2017 12:06:28
facebook Twitter Googleplus
Photo

మహేష్ బాబు కొత్త సినిమా స్పైడర్ టీజర్ కోసం అభిమానులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఆరంభం నుంచి టీజర్ ఇదిగో అదిగో అంటూనే ఉన్నారు కానీ.. ఇప్పటిదాకా దాని ఊసే లేదు. గత నెల ఫస్ట్ లుక్ పోస్టర్లతో సరిపెట్టిన స్పైడర్ యూనిట్.. సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజుకు టీజర్ విడుదల చేస్తుందని కొన్ని రోజుల కిందటే న్యూస్ బయటికి వచ్చింది. కానీ అంతలోనే టీజర్ రిలీజ్ క్యాన్సిల్ అంటూ వచ్చిన వార్తలు మహేష్ అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురి చేశాయి. సోషల్ మీడియాలో అభిమానులు తమ అసహనాన్ని కూడా ప్రదర్శించారు. ఇలాంటి తరుణంలో మహేష్ లైన్లోకి వచ్చి అభిమానుల్లో ఉత్సాహం నింపే వార్త చెప్పాడు.

ముందు అనుకున్న ప్రకారమే కృష్ణ పుట్టిన రోజుకు స్పైడర్ టీజర్ రిలీజవుతుందని ప్రకటించాడు మహేష్. మే 31న సాయంత్రం 5 గంటలకు టీజర్ వస్తుందని ట్విట్టర్లో వెల్లడించాడు నయా సూపర్ స్టార్. అంతే కాదు.. తమ సినిమా దసరాకు విడుదలవుతుందని కూడా ప్రకటించాడు మహేష్. దీంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. టీజర్ నిడివి 50 సెకన్లని అంటున్నారు. మరి ఈ టీజర్ ఎలా ఉండబోతోందో అన్న ఉత్కంఠ అభిమానుల్లో మొదలైపోయింది. నిన్న అర్ధరాత్రి నుంచి స్పైడర్ టీజర్ కు సంబంధించిన హ్యాష్ ట్యాగులతో అభిమానులు ట్విట్టర్లో సందడి చేస్తున్నారు.

,  ,  ,  ,  ,