Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Dec-2017 10:37:53
facebook Twitter Googleplus
Photo

అలనాటి నటి శ్రీదేవి అప్పటికి ఇప్పటికి అదే అందాన్ని మెయింటైన్ చేస్తోంది. వయసు ఎంత పెరుగుతున్నా కూడా అందంలో మాత్రం ఏ మాత్రం తేడా రానివ్వకుండా చూసుకుంటోంది. ఇండియన్ సినీ సిల్వర్ స్క్రీన్ పై ఆమె ఏ తరహాలో సినిమాలను చేసిందో అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు అదే తరహాలో తన కూతుళ్లు కూడా గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటోంది.

ప్రస్తుతం ఆమె పెద్ద కూతురు జాన్వీ కపూర్ 'ధఢఖ్' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. మరాఠీ సైరత్ సినిమాకు అది రీమేక్ గా తెరకెక్కుతోంది. రీసెంట్ గానే సినిమా కూడా స్టార్ట్ అయ్యింది. అయితే సినిమా షూటింగ్ లో తన కూతురి నటనను చూసి శ్రీదేవి చాలా ఆనందపడిపోతోందట. అంతే కాకుండా చిత్ర యూనిట్ సభ్యులు కూడా జాన్వి చాలా బాగా నటిస్తోందని ప్రశంసలను కూడా అందిస్తున్నారని రీసెంట్ గా లక్స్ గోల్డెన్ రోస్ అవార్డ్స్ వేడుకలో శ్రీదేవి వివరించింది.

వేడుకకి చాలా మంది సినీ ప్రముఖులు వచ్చారు. తన కూతురు మంచి హీరోయిన్ అవుతుందని ఆ నమ్మకం తనకు ఉందని ఆమె తెలుపడంతో అందరు క్లాప్స్ కొట్టారు. ఇక ధఢఖ్ సినిమాను ధర్మ ప్రొడక్షన్ అండ్ జీ స్టుడియోస్ పై కరణ్ జోహార్ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక హీరోగా షాహిద్ కపూర్ బ్రదర్ ఇషాన్ కట్టర్ నటిస్తుండగా శశాంక్ ఖైతాన్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

,  ,  ,  ,