Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Aug-2016 12:04:01
facebook Twitter Googleplus
Photo

వైవిధ్యమైన చిత్రాలు చేయడానికి అల్లు అర్జున్ వెనకాడరు. తాను చేసే ప్రతి సినిమా వైవిధ్యంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఇప్పటివరకూ బన్నీ లవ్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లలో నటించారు కానీ థ్రిల్లర్ సినిమా చేయలేదు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఆయన నటించనున్న కొత్త చిత్రం ఈ కోవకే చెందుతుందని సమాచారం. అల్లు అర్జున్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ?దిల్? రాజు నిర్మించనున్న ఈ సినిమా రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుందట. బౌండ్ స్క్రిప్ట్ రెడీ అయ్యిందట. ??హరీశ్ కెరీర్‌లో ది బెస్ట్ స్క్రిప్ట్ ఇది. చాలా జాగ్రత్తలు తీసుకుని రాశారు. ఇటీవల అల్లు అర్జున్‌కి పూర్తి కథ వినిపించారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌కి ఫినిషింగ్ టచ్ ఇచ్చేపనిలో బిజీగా ఉన్నారాయన?? అని నిర్మాణ సంస్థ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

సెప్టెంబర్‌లో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. తొలుత బన్నీ సరసన కథానాయికగా పూజా హెగ్డే పేరు పరిశీలనలోకి వచ్చింది. కానీ, ఈ గోపికమ్మ నటించే అవకాశాలు లేవట. దర్శక-నిర్మాతలు ఓ ప్రముఖ కథానాయికను ఎంపిక చేయాలని ఆలోచిస్తున్నారని సమాచారం. సినిమాలో కథానాయిక ఒక్కరే. ఆ పాత్రలో ఎవరు నటిస్తారనేది త్వరలో వెల్లడించనున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.

,  ,  ,  ,  ,