Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Aug-2015 16:59:39
facebook Twitter Googleplus
Photo

మహేష్ సినిమాకు మంచి టాక్ వస్తే బాక్సాఫీస్ దగ్గర అతడి జోరు ఎలా ఉంటుందో మరోసారి రుజువవుతోంది. ?శ్రీమంతుడు? టాలీవుడ్ బాక్సాఫీస్ ను దున్నేస్తున్నాడు. ఐదో రోజుకే 50 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టేసింది ?శ్రీమంతుడు?. ఇవి గ్రాస్ వసూళ్లు కూడా కావు... షేర్ కలెక్షనే. ఫస్ట్ వీకెండ్లో ఎలాంటి సినిమా అయినా ఆడేస్తుంది. కానీ సినిమా సత్తా ఏంటన్నది సోమవారం నుంచే తెలుస్తుంది. ఈ విషయంలో శ్రీమంతుడికి ఏమాత్రం ఢోకా లేదు. సినిమాకు తొలి రోజు నుంచి అన్ని వర్గాల నుంచి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. కొంచెం క్లాస్ మూవీ కాబట్టి సోమవారం నుంచి జోరు తగ్గుతుందేమో అని డౌట్లొచ్చాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర మహేష్ హవా కొనసాగుతూనే ఉంది.

సోమ మంగళవారాల్లో సైతం 80 శాతం ఆక్యుపెన్సీతో సాగుతున్నాడు ?శ్రీమంతుడు?. మార్నింగ్ మ్యాట్నీ షోలకు హౌస్ ఫుల్స్ పడకపోయినా.. ఫస్ట్ షో సెకండ్ షోలకు థియేటర్లు నిండిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో బంద్ ప్రభావం వల్ల కలెక్షన్లు కొంచెం తగ్గాయి కానీ.. తెలంగాణలో మాత్రం ఢోకా లేదు. రాబోయేది ఇండిపెండెన్స్ డే వీకెండ్ కాబట్టి.. రెండో వీకెండ్లోనూ ?శ్రీమంతుడు? బాక్సాఫీస్ ను దున్నేయడం ఖాయం. బాహుబలి తర్వాత వంద కోట్ల షేర్ సాధించిన సినిమాగా ?శ్రీమంతుడు? రికార్డుల్లోకెక్కడం ఖాయమనే చెప్పాలి.

,  ,  ,  ,