Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Dec-2015 18:38:39
facebook Twitter Googleplus
Photo

బ్రూస్ లీ సినిమా సూపర్ ఫ్లాప్ అవడంతో తో శ్రీనువైట్ల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. బడా హీరోల దగ్గర నుంచి బుడ్డ హీరోల వరకు తనతో సినిమా చేయడానికి పెద్దగా ఆసక్తి కనబరచలేదు. ఇటీవల చాలా మంది హీరోల చుట్టూ కథ పట్టుకోని తిరిగాడు శ్రీనువైట్ల. కానీ అందరూ మొహం చాటేశారు. తాజా సమాచారం ప్రకారం దగ్గుపాటి రానా కి ఇటీవల శ్రీనువైట్ల ఒక స్టీరీ లైన్ చెప్పాడట. అది రానాకు కూడా బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.

అన్నీ కుదిరితే ఈ సినిమాని సంక్రాంతి కానుకగా ప్రారంభించాలన్న పట్టుదలతో ఉన్నాడట శ్రీనువైట్ల. ఈ చిత్రాన్ని సురేష్ బాబు నిర్మిస్తారా లేక వేరే బేనర్ లో ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు శ్రీనువైట్ల చేసిన ఫార్మాట్ లో కాకుండా మరో కొత్త జోనర్లో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఆగడు బ్రూస్లీ సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవడంతో దూకుడు మీదున్న శ్రీనువైట్ల కెరీర్ ఒక్కసారిగా కిందకు పడిపోయింది. ఈ సినిమాతో ఫామ్లోకి రావాలని కసిగా పని చేస్తున్నాడట శ్రీనువైట్ల. చూద్దాం రానా రానిస్తాడో లేదో?

,  ,  ,