Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-May-2017 12:04:36
facebook Twitter Googleplus
Photo

హిందీ సినీ పరిశ్రమ మెగా మూవీ మేకర్ బాలీవుడ్ బెస్ట్ హోస్ట్ కరణ్ జోహర్ 45వ పుట్టిన రోజు వేడుకులు గత రాత్రి ఘనంగా జరిగాయి. సినిమా పరిశ్రమలు అన్నింటి నుండి తారలు కరణ్ కు శుభాకాంక్షలు చెప్పడానికి బొంబాయ్ వెళ్ళారులే. ప్రతి విజయాన్ని తన పరిశ్రమ మిత్రులుతో పంచుకోవడం కరణ్ కు అలవాటు. సినీ పరిశ్రమే నా కుటుంబం అని చాలా సార్లు చెప్పాడు. అందుకే భారీ రేంజు పార్టీలు ఇస్తుంటాడు.

ఇప్పుడు తన 45 వ పుట్టిన రోజు పార్టీ గెస్ట్ లిస్ట్ లో బాలీవుడ్ ఫ్రెండ్స్ తోపాటు టాలీవుడ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అందులో తప్పకుండా బాహుబలి టీమ్ ఉంటుందిని వేరే చెప్పాలా.. కాకపోతే ప్రభాస్ రాజమౌళి ఇండియాలో లేకపోవడంతో వారు వెల్ళలేదు. మన రానాకు ఎప్పటినుండో కరణ్ తో మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి అతను వెళ్ళాడు. ఇప్పుడు మరో స్పెషల్ గెస్ట్ తెలుగు ఇండస్ట్రి నుండి ఆహ్వానం అందుకున్నాడు. అతనే యంగ్ హీరో అక్కినేని అఖిల్. అయితే అఖిల్ ఈ ఫంక్షన్ కు వెళ్ళాడు అనే న్యూస్ ఎంత వైరల్ అయిందో తెలుసా? ఎంత వైరల్ చేశారో తెలుసా?

అక్కడికి ఈ పార్టీకి కేవలం అఖిల్ ఒక్కడినే టాలీవుడ్ నుండి పిలిచినట్లు.. అఖిల్ పి.ఆర్.ఏజెన్సీ చాలా హడావుడి చేసంది. దాదాపు అన్ని మీడియాల్లోనూ ఈ న్యూస్ కవర్ అయ్యేలా రచ్చ చేశారు. కాని నిజానికి కరణ్ జోహార్ ప్రత్యేకంగా అఖిల్ ఒక్కడినే పిలవలేదు కదా. దానికి ఇంత హడావుడి అక్కర్లేదు.

,  ,  ,  ,  ,