శ్రీరస్తు శుభమస్తు చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు డెరెక్టర్ పరశురామ్. శ్రీరస్తు శుభమస్తు చిత్రం అర్థ శత దినోత్సవాన్ని పూర్తి చేసుకుంది.తాజా సమాచారం ప్రకారం పరశురాం మరాఠీ లో ఘనవిజయం సాధించిన సైరాత్ చిత్రాన్ని రీమేక్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ప్రముఖ కన్నడ నిర్మాత నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ అన్ని దక్షణాది భాషల రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. తమిళ, కన్నడ, మలయాళం లో ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి పలువురు దర్శకులను కలసినట్లు సమాచారం. కాగా పరశురామ్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మరో చిత్రం చేయడానికి ఇప్పటికే కమిట్ అయ్యి ఉన్నాడు. సైరాత్ రీమేక్ కోసం త్వరలో నిర్మాత ఇతనిని కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.