Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Jan-2015 10:59:57
facebook Twitter Googleplus
Photo

భారీ అందాల ముద్దుగుమ్మ అనుష్కకు ఓ విగ్రహాన్ని నెలకొల్పుతున్నారు. అందులోనూ ఆ పని చేస్తున్నది ఎవరనుకుంటున్నారు.... ఒకప్పటి యాక్షన్ హీరో డాక్టర్ రాజశేఖర్! అయితే, ఆయనేమీ ఆమెకు అభిమాని కాదులెండి. ఆయన నటిస్తున్న 'గెడ్డం గ్యాంగ్' సినిమా కోసం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళితే, తమిళ చిత్రం 'సూదు కవ్వం' ఆధారంగా రాజశేఖర్ హీరోగా తెలుగులో 'గెడ్డం గ్యాంగ్' చిత్రం రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఇందులో హీరో వెండితెర నాయిక అనుష్కకు వీరాభిమానిగా కనిపిస్తాడు (తమిళ ఒరిజినల్ లో నయనతారను పెట్టారు). ఆమె పట్ల హీరోకి ఎంత అభిమానమంటే, తన ఊర్లో ఆమెకు ఓ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తాడు. సో, ఈ సినిమాలో అలా అనుష్క విగ్రహం రూపంలో కనిపిస్తుందన్న మాట!

,  ,  ,  ,  ,