Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Apr-2017 16:21:27
facebook Twitter Googleplus
Photo

కరక్టుగా ప్రీ-క్లయమ్యాక్సులో.. శివుడు ఎలియాస్ మహేంద్ర బాహుబలి తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుందామని ప్రయత్నించి.. విఫలమవుతాడు. ఆ సమయంలో ఏం జరుగుతుందా అని ఆలోచించనపుడు.. అక్కడికి అస్లాం ఖాన్ వస్తాడేమో అనుకున్నారు అందరూ. కాని రాలేదు. అసలు ఇంతకీ ఇతగాడు ఏమైపోయినట్లు?

బాహుబలి 1 సినిమాలో కట్టప్పను కలవడానికి వచ్చే పర్షియన్ వర్తకుడిగా అస్లాం ఖాన్ పాత్ర కనిపిస్తుంది. కన్నడ హీరో సుదీప్ ఈ గెస్ట్ ఎప్పీయరెన్స్ ఇచ్చాడులే. అయితే ఈ పాత్ర అప్పుడు కష్టాల్లో ఉంటే కట్టప్పకు సాయం చేస్తానని మాటిచ్చాడు కాబట్టి.. సెకండ్ పార్టులో కనిపిస్తాడనే అందరూ అనుకున్నారు. కాని మనోడు మాత్రం ఎక్కడా తగల్లేదు. ఇక్కడే ఒక డిస్కషన్ కు తెరలేస్తోంది. అసలు బాహుబలి 1లో పెద్దగా కంటెంట్ లేదు. అందుకే సాగతీయడానికి ఇలా గెస్టు ఎప్పీయరెన్సుగా సుదీప్ ను పిలిచి.. రాజమౌళి కాస్త ఆసక్తిని రేకెత్తించాడేమో. అందుకే సెకండ్ పార్టులో ఎలాగో అసలు కథే చాలా ఉంది కాబట్టి.. అతడ్ని పక్కనెట్టేశారు.

మొత్తానికి బాహుబలి 1 చూశాక ఒక రకమైన కథను ఎక్సపెక్ట్ చేసిన ప్రేక్షకులు.. ఇప్పుడు 2 రాగానే కాస్త నిరాశచెందారట.

,  ,  ,  ,