Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Jul-2017 12:02:47
facebook Twitter Googleplus
Photo

హీరోలు కెరీర్ ను కొత్తగా డిజైన్ చేసుకోవడానికి ఏ మాత్రం ఆలోచించడం లేదు. హీరోగానే ఉండాలి.. మాస్ ఇమేజ్ తెచ్చేసుకోవాలి.. లాంటి చట్రాల్లో ఇరుక్కుపోవడం లేదు వీరంతా. అవసరం అయితే.. విలన్ గా నటించేందుకు కూడా వెనుకాడ్డం లేదు కొందరు యంగ్ స్టర్స్. సరైనోడు మూవీలో ఆది పినిశెట్టి విలన్ గా నటించి ఆకట్టుకోగా.. ఇప్పుడు మరో హీరో కూడా విలన్ అవతారంలో కనిపించబోతున్నాడట.

అతనెవరో కాదు.. మహేష్ బాబు బావ సుధీర్ బాబు. శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన శమంతకమణి చిత్రం ఈ నెల 14న రిలీజ్ కానుండగా.. ఈ సినిమాలో నలుగురు కుర్రాళ్లు హీరోలుగా నటించారు. నారా రోహిత్.. సందీప్ కిషన్.. ఆది.. సుధీర్ బాబులు ఈ చిత్రంలో నటించగా.. వీరిలో సుధీర్ బాబు పాత్ర ప్రత్యేకంగా నిలుస్తుందని తెలుస్తోంది. సుధీర్ చేస్తున్న ఈ రోల్ లో నెగిటివ్ కోణం ఉంటుందని.. సినిమాకు తనే విలన్ అనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకూ తన కెరీర్ లో ఎన్నడూ కనిపించనంత కొత్తగా సుధీర్ బాబు పాత్ర ఉంటుందట.

అయితే.. సుధీర్ బాబుకు విలన్ పాత్ర చేయడం కొత్తేమీ కాదు కానీ.. టాలీవుడ్ లో చేయడం కొత్త విషయం. ఇప్పటికే బాఘీ అంటూ బాలీవుడ్ లో విలన్ గా నటించి మెప్పించాడు సుధీర్ బాబు. ఇప్పుడు టాలీవుడ్ కి కూడా తన విలనిజం చూపించబోతున్నాడన్న మాట.

,  ,  ,  ,  ,  ,