Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Jun-2016 12:07:04
facebook Twitter Googleplus
Photo

సినిమాని గ్రాండ్ గా చూపించే దర్శకులు ఉంటారు.. క్రియేటివ్ గా తీసే డైరెక్టర్లు ఉంటారు.. అందాలను ఆరబోయించే దర్శకులు కూడా ఉంటారు. కానీ సుకుమార్ మాత్రం ఓ 'లెక్క' ప్రకారం తీస్తాడు. సినిమా నిండా లెక్కలే కనిపిస్తూ ఉంటాయి. చూసేవాళ్లకి కూడా ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఓ రేంజ్ లో ఉండాల్సిందే. అంత పక్కాగా లెక్కలు చూపించే ఈయన.. సినిమా బడ్జెట్ లెక్కలు మాత్రం తప్పుతూనే ఉంటాయి.

ప్రస్తుతం ధృవ చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయనున్నాడు సుకుమార్. ఇప్పటివరకూ టాలీవుడ్ లో రాని ఓ కొత్త కాన్సెప్ట్ తో సినిమా తీసేందుకు రెడీ అవుతున్న సుక్కు.. ఈ మూవీ కోసం ఏకంగా 70 కోట్ల బడ్జెట్ ని కోట్ చేశాడట. స్టోరీ విషయంలో ఫుల్ శాటిస్ఫై అయిన చెర్రీ.. ఈ బడ్జెట్ ఫిగర్ వినగానే ఆశ్చర్యపోయాడని అంటున్నారు. ఇంత బడ్జెట్ తో సినిమా అంటే.. ప్రొడ్యూసర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ వరకూ ప్రతీ ఒక్కరూ రిస్క్ ఫేస్ చేయాల్సి ఉంటుందని భావిస్తున్నాడట రామ్ చరణ్.

గతంలో ఈ 70 కోట్లకు మించి ఖర్చు చేసి మహేష్ తో తీసిన 1నేనొక్కడినే చిత్రం.. ఏ స్థాయిలో డిజాస్టర్ గా నిలిచిందో.. చెర్రీకి ఫుల్లు క్లారిటీ ఉంది. ఆ తర్వాత ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో 50 కోట్లకు పైగా వసూలు చేసినా హిట్ అనిపించుకోలేక పోవడానికి ప్రధాన కారణం బడ్జెట్. అందుకే ఈ 70కోట్లను వీలైనంతగా తగ్గించాలని సూచించాడట.

అయినా ఇప్పటివరకూ సుకుమార్ తీసిన సినిమాల్లో ఒక్కటి కూడా కనీసం 60కోట్లు వసూలు చేయలేదు. అయినా సరే ప్రతీసారీ 70 కోట్లకు లెక్క చెప్పడంలో ఆంతర్యం ఏంటో.. ఈలెక్కల మాస్టారే చెప్పాలి.

,  ,  ,  ,  ,  ,