Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Feb-2017 13:29:50
facebook Twitter Googleplus
Photo

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా సుకుమార్ దర్శకత్వంలో ఒక చిత్రానికి సైన్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం త్వరలో చిత్రీకరణకు వెళ్లనుంది. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మార్చి ఆరంభంలో కేరళలో మొదటి షెడ్యూల్ మొదలయ్యే అవకాశాలున్నాయి. ఇకపోతే పక్కా పల్లెటూరి నైపథ్యంలో సాగే ఈ సినిమాకి అందమైన టైటిల్ వెతికే పనిలో ఉన్నారు సుకుమార్ అండ్ టీమ్.
ఇప్పటికే ?రేపల్లె గోపాలుడు? వంటి అచ్చ తెలుగు పేర్లు వినిపిస్తున్నప్పటికీ వేటి మీదా సరైన నిర్ణయం వెలువడలేదు. మరోవైపు ప్రీ లుక్ పోస్టర్ చూసి బాగా ఇంప్రెస్ అయిన అభిమానులు మాత్రం టైటిల్, రామ్ చరణ్ ఫస్ట్ లుక్ వంటి వాటి కోసం ఎదురుచూస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రఫీ భాద్యతలను పర్యవేక్షిస్తున్నఈ చిత్రంలో చరణ్ కు జోడీగా సమంత నటించనుంది.

,  ,  ,  ,  ,