రజని నటిస్తున్న కబాలి ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇంకా తెలియక ముందే , మలేషియాలో జులై 22న విడుదల అంటూ ఫ్లెక్సీలు వేసి.. ప్రమోషన్లు మొదలుపెట్టారు..అంతే కాదు 21న ?కబాలి? ప్రిమియర్ షోకు సంబంధించి టికెట్లు కూడా ట్విట్టర్లో పెట్టేశారు. మలేషియా రాజధాని కౌలాలంపూర్లోని ఎన్యూ సెంట్రల్ సినిమా హాల్లో 21న రాత్రి 9.01 గంటలకు ?కబాలి? వీవీఐపీ ప్రిమియర్ షో వేయబోతున్నట్లు టికెట్స్ ప్రింట్ చేశారు..
ఇది చూస్తే కబాలి రిలీజ్ అదే అని అందరూ భావిస్తున్నారు..ఈరోజు కానీ రేపు కానీ కబాలి సెన్సార్ జరగబోతుందని వినికిడి..సెన్సార్ పూర్తి అయితే వెంటనే రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది..