Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Nov-2016 11:07:57
facebook Twitter Googleplus
Photo

శుక్రవారం విడుదలయిన "నరుడా డోనరుడా" సినిమా ప్రమోషన్ లో బిజీగా గడుపుతున్నాడు హీరో సుమంత్. సుమారు రెండేళ్లకు పైగా గ్యాప్ తర్వాత చాలా హోప్స్ పెట్టుకున్న సినిమా కావడంతో ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా సోషల్ మీడియాలో తన అభిమానులతో లైవ్ షోలో పాల్గొన్నాడు. ఆ సందర్భంగా తన అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చిన సుమత్... మహేష్ - పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రం షాకింగ్ ఆన్సర్స్ చెప్పాడు.

ఈ సందర్భంగా ఒక అభిమాని మాట్లాడుతూ... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేదా ప్రిన్స్ మహేష్ బాబులలో ఎవరంటే మీకిష్టం అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నపై స్పందించిన సుమంత్ ఏమాత్రం తడుముకోకుండా పవన్ అభిమానులకు సారీ చెబుతూనే మహేష్ బాబు అభిమానులు ఖుషీ అయ్యే ఆన్సర్ ఇచ్చాడు. "నా ఫేవరెట్ హీరో మహేష్ బాబు... అండ్ సారీ పవర్ స్టార్ ఫ్యాన్స్" అని తడుముకోకుండా ఆన్సర్ చెప్పేశాడు. ఇదే క్రమంలో తెలిసి అడిగాడో తెలియక అడిగాడో కానీ... "పెళ్లెప్పుడు చేసుకుంటారు?" అని మరో అభిమాని కొంటె ప్రశ్న వేశాడు. దీనికి అదే స్థాయి కొంటెగా సమాధానం చెప్పిన సుమంత్... "నేను అందరి పెళ్లిళ్లకూ వెళ్తాను కానీ నా పెళ్లికి మాత్రం వెళ్లను" అని చమత్కారించాడు.

కాగా పవన్ - మహేష్ ల విషయంలో సుమంత్ అలా స్పందించడానికి బలమైన కారణమే ఉంది. మహేష్ కి సుమంత్ ఎప్పటినుంచో బెస్ట్ ఫ్రెండ్ కూడా. గతంలో ముఖ్యంగా సత్యం మూవీ టైంలో మహేష్ బాబు చెప్పిన అనేక సలహాలను సుమంత్ పాటించాడట! దీంతో ఆ మూవీ సుమంత్ కు ఇప్పటివరకూ ఉన్న సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దీంతో అప్పట్లోనే మహేష్ తో తన ఫ్రెండ్ షిప్ గురించి పలు సందర్భాల్లో వివరించాడు సుమంత్. ఇక పెళ్లి విషయానికొస్తే... సుమంత్ కు హీరోయిన్ కీర్తి రెడ్డితో గతంలోనే వివాహం జరిగింది. అయితే... విభేదాల కారణంగా ఇరువురూ విడిపోయారు. ఈ నేపథ్యంలోనే తన పెళ్లిపై తానే ఇలా కామెంట్ చేశారని తెలుస్తోంది! ఏది ఏమైనా... పవన్ మహేష్ లపై సుమంత్ చేసిన కామెంట్ ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి!!

,  ,  ,  ,  ,