Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-May-2015 09:37:30
facebook Twitter Googleplus
Photo

ఒక సినిమా రూపొందుతోందంటే సాధ్యమైనంత వరకు అందులో అనేక విశేషాలకు చోటు కల్పించడానికి దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తుంటారు. అలాంటి విశేషాల కారణంగానే, ఆడియన్స్ లో ఆ సినిమా పట్ల ఆసక్తి పెరుగుతూ వుంటుంది. అలాంటి ప్రత్యేకతగా .. అఖిల్ సినిమాలో చైతూ గెస్ట్ రోల్ చేస్తున్నాడనే ప్రచారం ఆ మధ్య బాగా జరిగింది. వినాయక్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఓ భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. 'మనం' సినిమాలో అఖిల్ - చైతూ కాసేపు కనిపించినా, ఈ సినిమాలో విభిన్నంగా దర్శనమిస్తారనే వార్తలు వినిపించాయి.

భారీ అంచనాలతో రూపొందుతోన్న ఈ సినిమాలో చేయడానికి చైతూ ఉత్సాహాన్ని చూపాడని అన్నారు. అభిమానులు కూడా ఈ సినిమాలోని విశేషాలలో ఇది ఒకటనే భావించారు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం .. తాను ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదనీ, అసలు అలాంటి ఆలోచనే చేయలేదని నాగచైతన్య స్పష్టం చేశాడు. దాంతో ఈ సినిమాలో నాగచైతన్య కూడా కనిపిస్తాడనే ప్రచారానికి తెరపడింది.

,  ,  ,  ,  ,