Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Jun-2016 16:15:56
facebook Twitter Googleplus
Photo

సుమంత్ అనే హీరో ఒకడు టాలీవుడ్లో ఉన్న సంగతే మరిచిపోయారు జనాలు. సత్యం.. గోదావరి.. గోల్కొండ హైస్కూల్ లాంటి సినిమాలతో అప్పుడప్పుడూ తన ఉనికినైతే చాటుకున్నాడు కానీ.. హీరోగా తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించలేకపోయాడు నాగార్జున మేనల్లుడు. సుమంత్ లాస్ట్ మూవీ ?ఏమో గుర్రం ఎగరావచ్చు? అతణ్ని మామూలు దెబ్బ కొట్టలేదు. దీనికి తోడు తాత మరణం వల్ల కూడా సినీ కార్యక్రమాలు వేటిలోనూ కనిపించకపోవడంతో జనాలు అతణ్ని పూర్తిగా మరిచిపోయారు. ఈ దెబ్బతో ఇండస్ట్రీ నుంచే అంతర్ధానమయ్యే పరిస్థితికి వచ్చాడు సుమంత్.

ఐతే ఈసారి బాగా గ్యాప్ తీసుకుని.. ఓ హిందీ రీమేక్ తో జనాల్ని పలకరించాలని చూస్తున్నాడు సుమంత్. హిందీలో సెన్సేషనల్ కాన్సెప్టుతో తెరకెక్కి.. సెన్సేషనల్ హిట్టయిన ?విక్కీ డోనర్?ను సుమంత్ రీమేక్ చేస్తున్నాడని ఆ మధ్య వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. దీనికి మించి ఏ అప్ డేట్ లేదు ఇంతవరకూ. ఐతే ఉన్నట్లుండి సుమంత్ తన సోషల్ మీడియా అకౌంట్లో ఈ సినిమాకు డబ్బింగ్ చెబుతున్న ఫొటోను షేర్ చేశాడు సుమంత్. సినిమా పూర్తయిపోయిందని ఈ ఫొటో ద్వారా చెప్పకనే చెప్పాడు సుమంత్. ఐతే అసలే ఇది వీర్యదానం నేపథ్యంలో తెరకెక్కుతున్న ప్రయోగాత్మక చిత్రం. ఇలాంటి కాన్సెప్ట్ ను మన జనాలు ఏమాత్రం జీర్ణించుకుంటారో అన్న సందేహాలు కూడా ఉన్నాయి. పైగా సుమంత్ సినిమా కాబట్టి అంతగా హైప్ కూడా లేదు. ఈ నేపథ్యంలో సినిమాను ముందు నుంచి ప్రమోట్ చేయడం.. వార్తల్లో నిలబెట్టడం కీలకం. కానీ సినిమా మొదలైన సంగతీ తెలియదు. పూర్తయిన సంగతీ తెలియదు. అసలు ఈ చిత్రానికి ఇప్పటిదాకా పేరు పెట్టలేదు. ఒక పోస్టర్ వదల్లేదు. టీజర్ రాలేదు. ప్రమోషన్ చాలా కీలకం అవుతున్న ఈ రోజుల్లో సుమంత్ వ్యవహరిస్తున్న ఆశ్చర్యం కలిగిస్తోంది. మరి సుమంత్ ఇంకెప్పుడు ప్రమోషన్ మొదలుపెడతాడో చూడాలి. మల్లిక్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.

,  ,  ,  ,  ,  ,  ,