Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Sep-2016 11:17:06
facebook Twitter Googleplus
Photo

సుమంత్ అనే హీరో ఒకడు తెలుగులో ఉన్నాడన్న సంగతే జనాలు మరిచిపోయారు. వరుస ఫ్లాపులకు తోడు.. రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకోవడంతో అతణ్ని జనాలు మరిచిపోయారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ?విక్కీ డోనర్?ను సుమంత్ రీమేక్ చేస్తున్నాడన్న వార్త బయటికి వచ్చినా జనాలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. మరోవైపు వీర్యదానం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న సందేహాలు కూడా నెలకొన్నాయి.

ఐతే ?నరుడా డోనరుడా? ఫస్ట్ లుక్ పోస్టర్లు చూశాక మాత్రం సీన్ మారిపోయింది. బోల్డ్ కాన్సెప్టుతో సినిమా చేస్తున్న సుమంత్.. ఏమీ దాపరికం లేకుండా కథేంటో జనాలకు అర్థమయ్యేలా పోస్టర్లతో రావడం మంచిదైంది. ?నరుడా డోనరుడా? ఫస్ట్ లుక్ పోస్టర్లు టాలీవుడ్లో బాగానే చర్చనీయాంశమయ్యాయి. ఈ పోస్టర్లు వదిలిన రోజు ట్విట్టర్లో ?నరుడా డోనరుడా? అనే హ్యాష్ ట్యాగ్ టాప్ ట్రెండింగ్స్ లో ఉండటమే దీనికి నిదర్శనం. సెలబ్రెటీలు కూడా చాలామంది ఈ సినిమా గురించి పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు
.
మొత్తానికి విడుదలకు ముందు తన సినిమా చర్చనీయాంశం కావాలని.. పాజిటివ్ బజ్ తెచ్చుకోవాలని సుమంత్ చేసిన ప్రయత్నం బాగానే ఫలించింది. మల్లిక్ రామ్ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ సినిమాను సుమంతే స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో సుమంత్ సరసన హిందీ సీరియల్ నటి పల్లవి సుభాష్ నటిస్తోంది. అక్టోబర్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

,  ,  ,  ,  ,