Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Jun-2016 15:00:54
facebook Twitter Googleplus
Photo

ఇండియన్ సినిమా అంటే బయటివాళ్లకు హిందీ సినిమా మాత్రమే. బాలీవుడ్ తర్వాత ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ పెంచిన ఘనత తమిళ సినిమాదే అని చెప్పాలి. మన దగ్గరా ఒకప్పుడు గొప్ప సినిమాలే వచ్చాయి కానీ.. గత కొన్ని దశాబ్దాల్లో తమిళ సినిమా మనల్ని దాటేసి చాలా ఎత్తుకు ఎదిగిపోయింది. బాలీవుడ్ వాళ్లు సైతం తమిళ సినిమాల్ని చూసి స్ఫూర్తి పొందే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమయంలో మన రాజమౌళి.. ఈగ - బాహుబలి లాంటి సినిమాలతో తెలుగు సినిమా సత్తా చాటి చెప్పాడు. ఈ సినిమా తమిళంలోనూ సెన్సేషనల్ హిట్టయి.. అక్కడి దర్శక నిర్మాతల్ని ఆలోచనలో పడేసింది. మనం ఇలాంటి సినిమా తీయలేమా అని చర్చించుకునేలా చేసింది. అదే సమయంలో చింబుదేవన్ తీసిన ?పులి? మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ.. అది తీవ్రంగా నిరాశ పరిచింది.

ఐతే కోలీవుడ్ ఫిలిం మేకర్స్ దేన్నీ అంత తేలిగ్గా వదిలే రకాలు కాదు. చింబుదేవన్ వల్ల కానిది తాను చేస్తానంటూ సీనియర్ డైరెక్టర్ సుందర్.సి ఓ భారీ మైథలాజికల్ మూవీకి సన్నాహాలు చేస్తున్నాడు. తమిళంలో భారీ నిర్మాణ సంస్థ అయిన తెండ్రాల్ ఫిలిమ్స్ తన వందో సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతోందట. ఈ సినిమా బడ్జెట్ రూ.250 కోట్లు కావడం విశేషం. స్వయంగా నిర్మాణ సంస్థే ఈ విషయాన్ని ప్రకటించింది. ?24? ఫేమ్ తిరును కెమెరామన్ గా.. ?బాహుబలి?కి ఆర్ట్ డైరెక్షన్ చేసిన సాబు శిరిల్ ను ప్రొడక్షణ్ డిజైనర్ గా ఎంచుకున్నారు. సంగీత బాధ్యతల్ని ఇళయరాజా లేదా ఎ.ఆర్.రెహమాన్ కు అప్పగించే అవకాశముంది. ఈ సినిమాలో సూర్యను ఓ కథానాయకుడిగా అనుకుంటున్నారు. మరో హీరో కూడా కీలక పాత్ర పోషించే అవకాశముంది. త్వరలోనే ఈ సినిమా గురించి పూర్తి వివరాలు వెల్లడవుతాయి.

,  ,  ,  ,  ,