Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Aug-2017 12:41:51
facebook Twitter Googleplus
Photo

న్యాచురల్ గా కనిపించడం కోసం రకరకాలు ప్రయత్నాలు చేస్తుంటారు తారాగణం. కొందరు తమ చేయబోయే పాత్ర కోసం కసరత్తులు చేస్తూ సన్నడటం లేదా లావు అవ్వడం మాములే. అయితే హీరో సందీప్ కిషన్ మాత్రం నక్షత్రం కోసం విపరీతంగా చెమటోడ్చినట్లుగా తెలిసింది. దాదాపు సంవత్సరన్నర నుంచి ఈ సినిమా కోసం పనిచేసిన సందీప్ కిషన్ అటు ఇటుగా ఓ 120 రోజులు పాటు ప్రతి రోజు ఎండలో రెండు గంటలు పాటు నిల్చొనేవాడని సమాచారం.

అసలే కాస్త కలర్ తక్కువుగా కనిపించే సందీప్ మరింత డార్క్ గా కనిపించేందుకే ఇలా ఎండలో పరుగులెత్తే వాడట. అయితే ఇదంతా కృష్ణ వంశీ ఆదేశాలు మేరకే సందీప్ చేసాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. పాత్రలు తీరు తెన్నులు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే కృష్ణ వంశీ సందీప్ పోషించే రోల్ న్యాచురల్ గా ఉండాలానే ఉద్దేశంతోనే ఈ విధంగా చెయించాడట.

,  ,  ,  ,  ,