Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Nov-2016 10:28:42
facebook Twitter Googleplus
Photo

సినీ ఇండస్ట్రీలో నిలదొక్కోవాలంటే అంతకు మించిన అదృష్టం ఉండాలి. ఆ లక్ లేకే కొన్నేళ్లుగా హిట్ కోసం మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు సందీప్ కిషన్. కెరీర్ మొదట్లో రెండు మూడు విజయాలు సాధించి మాంచి ఊపు మీదున్నట్టు కనిపించాడు సందీప్. కానీ అంతలోనే బండికి బ్రేక్ లు పడ్డాయ్. గేర్ మార్చి హిట్ ట్రాక్ ఎక్కుదామని ఎంత ట్రై చేస్తున్నా సందీప్ ఆశలు మాత్రం నెరవేరట్లేదు.

తెలుగు.. తమిళ్.. ఎప్పుడో ఓ సారి హిందీ అంటూ అన్ని లాంగ్వేజెస్ లో ట్రై చేస్తున్నాడు. భారీ మొత్తం ఇచ్చుకోని టాప్ రేస్ లో ఉన్న హీరోయిన్స్ తో జత కడుతున్నాడు కానీ విజయం మాత్రం పలకరించట్లేదు. అయినా సరే ఎక్కడా తగ్గట్లేదు సందీప్. తెలుగులో నటిస్తూనే అల్రెడీ మాయవన్.. మానగరమంటూ రెండు తమిళ్ మూవీస్ ని లైన్లో పెట్టిన ఈ యంగ్ హీరో.. ఇప్పుడు మరో బైలింగ్వల్ లో యాక్ట్ చేస్తున్నాడు. సెన్సిటివ్ కాన్సెప్ట్స్ తో అదిరిపోయే సినిమాలు తీసే తమిళ డైరెక్టర్ సుశీంద్రన్ సందీప్ కొత్త సినిమాకి డైరెక్టర్.

ఈ బైలింగ్వల్ లో సందీప్ కి జోడీగా క్రిష్ణగాడి వీరప్రేమగాథ హీరోయిన్ మెహ్రీన్ యాక్ట్ చేస్తోంది. చూడటానికి కాంబినేషన్స్.. స్టార్ కాస్టింగ్ అంతా బానే ఉన్నట్టు కనిపిస్తోన్న యాక్షన్ బేస్డ్ మూవీ అంటేనే మళ్లీ అనుమానాలు వస్తున్నాయ్. యాక్షన్ హీరో అనిపించుకోవాలని చేస్తోన్న ప్రయత్నాలే సందీప్ కెరీర్ కి బ్రేక్ లు వేస్తున్నాయ్. మరి ఈ విషయం ఐడెంటిఫై చేశాడో లేదో కానీ మళ్లీ అదే అటెంప్ట్ చేస్తున్నాడు. మరి సుశీంద్రన్ అయినా సందీప్ ఆశలు నెరవేరుస్తాడో లేదో చూడాలి.

,  ,  ,  ,  ,