Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Nov-2017 13:19:41
facebook Twitter Googleplus
Photo

కెమెరామెన్ చోటా కె నాయుడు మేనల్లుడు సందీప్ కిషన్ అదృష్టం మాములుగా లేదు. మనోడి కెరీర్ వరదలు వస్తే నీరు పరిగెత్తినంత స్పీడ్ గా పరుగెత్తుతోంది. జయపజయాలతో సంబందం లేకుండా సినిమాలను చేస్తున్నాడు. ఒక్క తెలుగులోనే కాకుండా కోలీవుడ్ బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ప్రస్తుతం చేతిలో సినిమాలు భాగమే ఉన్నాయి.

అయితే తనకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టమని ఆయనను ప్రేరణగా తీసుకుంటానని చెబుతున్నాడు. సందీప్ తన లేటెస్ట్ మూవీ C/O సూర్యా సినిమాను ఈ నెల 10న రిలీజ్ చేయబోతున్నాడు. సుసీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్ గా నటిస్తోంది. సందీప్ ఈ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నాడు. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మనోడు మహేష్ బాబుపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు.

సందీప్ మాట్లాడుతూ..మహేష్ బాబు సర్ నుండి చాలా నేర్చుకోవాలి. అతను ఒక సూపర్ స్టార్ అయినప్పటికీ చాలా విభిన్నమైన పాత్రలను చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఏదైనా కొత్తగా చేయాలని అనుకుంటారు. ఆ ఆలోచనే ఆయనను సూపర్ స్టార్ చేసి ఉంటుందని అందుకే నేను కూడా ఆయనను ప్రేరణగా తీసుకున్నాను అని చెప్పుకొచ్చాడు.

ఇక సందీప్ రానున్న మరికోన్ని నెలల్లో మూడు సినిమాలను కూడా రిలీజ్ చేయనున్నాడు.

,  ,  ,  ,