Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Mar-2017 10:51:31
facebook Twitter Googleplus
Photo

సందీప్ కిషన్-రెజీనా నటించిన నగరం మూవీ మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి వచ్చేస్తోంది. ట్రైలర్ ఆసక్తిగా ఉండడమే కాదు.. తమిళ్ వెర్షన్ ని మీడియాకి ప్రదర్శించేశారు కూడా. సినిమా మీద ఉన్న నమ్మకంతో వీళ్లు స్పెషల్ షో వేస్తే.. మూవీ అద్భుతం అంటూ మంచి రివ్యూలు కూడా పోస్ట్ అయిపోయాయి. దీంతో పాజిటివ్ టాక్ మరింతగా పెరిగింది.

ఇంతవరకూ బాగుంది కానీ.. మరి సినిమా రిలీజ్ పరిస్థితేంటి? అంటే మాత్రం సమాధానం ఇచ్చేవారెవరూ కనిపించడం లేదు. ఇలాంటి థీమ్ బేస్డ్ సినిమాలు ముందు కాసింత క్లాస్ జనాలకు ఎక్కితేనే.. మాస్ వరకూ వెళ్తాయి. కానీ నగరం మూవీని ఎక్కడా మల్టీప్లెక్సుల్లో పట్టించుకుంటున్నట్లు కనిపించడం లేదు. ఒకటీ.. అరా షోలతో సరిపెట్టేస్తున్నారు. అది కూడా ఈవెనింగ్ షోస్ కాదు. ఇది నగరం లాంటి చిన్న మూవీలను ఇబ్బంది పెట్టే విషయం.

రిలీజ్ విషయంలో జాగ్రత్త పడకపోతే.. ఎంత మంచి సినిమా అయినా థియేటర్లలో నిలబడ్డం కష్టం. మల్టీప్లెక్సుల్లో సినిమా నిలబడితే.. సింగిల్ స్క్రీన్స్ ను అట్రాక్ట్ చేయడం అంత కష్టమైన విషయం కాదు. రివ్యూలు.. రేటింగులు బాగా వచ్చిన సినిమా విషయంలో మరింతగా జాగ్రత్త పడాలి సందీప్

,  ,  ,  ,  ,