Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Nov-2016 11:23:30
facebook Twitter Googleplus
Photo

గత మూణ్నాలుగేళ్లలో తన రేంజి బాగా పెంచుకున్నాడు అల్లు అర్జున్. వరుసగా నాలుగు 50 కోట్ల షేర్ సినిమాలు అందించడమే కాదు.. ?సరైనోడు?తో వంద కోట్ల గ్రాస్ మార్కును కూడా టచ్ చేశాడు. మరోవైపు సౌత్ ఇండియాలో అతడి ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.

సోషల్ మీడియాలో కూడా బన్నీ హవా మామూలుగా లేదిప్పుడు. తాజాగా యూట్యూబ్ లో బన్నీ పాట ఒకటి సంచలన రికార్డును అందుకుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ?రేసుగుర్రం? సినిమాలోని ?సినిమా చూపిస్త మావ? సాంగ్.. యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న తెలుగు పాటగా రికార్డు నెలకొల్పింది. ఈ పాటను ఏకంగా 19 లక్షల మంది చూశారు యూట్యూబ్ లో.

వరికుప్పల యాదగిరి రాసిన క్యాచీ లిరిక్స్.. తమన్ ఊపున్న ట్యూన్ కు తోడు.. సింహా-గంగ మంచి ఎనర్జీతో పాడటంతో ఈ పాట ఇన్ స్టంట్ హిట్టయింది. చిత్రీకరణ కూడా భలే సరదాగా ఉంటుంది. జానీ మాస్టర్ అదిరిపోయే స్టెప్స్ కంపోజ్ చేశాడు. బన్నీ ఎనర్జీ.. శ్రుతి హాసన్ గ్లామర్ కూడా ఈ పాటకు ప్లస్సయ్యాయి. సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఈ పాటను గత ఏడాది మేలో యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. త్వరలోనే ఈ పాట 2 మిలియన్ వ్యూస్ మార్కును అందుకోబోతోంది.

,  ,  ,  ,  ,  ,