Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Jul-2017 11:08:28
facebook Twitter Googleplus
Photo

నిన్ను కోరి సినిమా తర్వాత సినిమా లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ శమంతకమణి. మంచి టాలెంట్ ఉండి పెద్ద రేంజ్ కి రావాలని కష్టపడుతున్న యూత్ హీరోలు ఇందులో కలిసి నటిస్తున్నారు కాబట్టి ఇది ఒకరకంగా మల్టీ స్టారర్ అని చెప్పొచ్చు. ట్రైలర్ ఇప్పటికే చాలా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. నారా రోహిత్ - సందీప్ కిషన్ - సుధీర్ బాబు - ఆది సాయి కుమార్ హీరోలుగా నటిస్తున్న ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఒక పాత వింటేజ్ కారు చుట్టూ తిరిగే ఈ థ్రిల్లర్ మూవీ లో నలుగురి పాత్రలకు ఆ కారుకు సంబంధం ఏంటి అనే దాని మీదే కథ మొత్తం అల్లుకున్నాడు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. గతంలో సుధీర్ బాబు హీరోగా చేసిన ఇతని మొదటి సినిమా భలే మంచి రోజు అందరిని మెప్పించింది. ఇప్పుడు అదే బాటలో మరో థ్రిల్లర్ మూవీని సిద్ధం చేసాడు శ్రీరామ్. ఈ రోజు సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్ తెచ్చేసుకుంది శమంతకమణి.

నలుగురు హీరోలు ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ కానుంది. ఇందులో సందీప్ కిషన్ సినిమాల పిచ్చి ఉన్నోడిగా కనిపిస్తున్నాడు. హైదరాబాద్ వచ్చి ఎలాగైనా హీరో కావాలి అనే తాపత్రయంలో ఉండే పాత్రలో సందీప్ కిషన్ పాత్ర మంచి మాస్ ఎలెమెంట్స్ ఉండేలా తీర్చిదిద్దినట్టు తెలిసింది. మరి ఈ పాత్రకు ఆ కారుకు లింక్ ఏంటి అనేది ఆసక్తికరంగా ఉంటుందట. ఇక మిగిలిన మూడు హీరోల పాత్రలు కూడా అదే రకంగా ఊహించని విధంగా ఒకదానికొకటి ముడిపెట్టి చిక్కుని విడదీసే విధానం తప్పకుండ థ్రిల్ చేస్తుంది అంటున్నాడు దర్శకుడు.

,  ,  ,  ,  ,