Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Apr-2016 12:49:18
facebook Twitter Googleplus
Photo

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన క్రేజును సొమ్ము చేసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపించడు కానీ.. అతను కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తే కోట్లు సంపాదించొచ్చు. అడ్వర్ టైజ్ మెంట్స్ చేయడం మొదలుపెడితే.. పవన్ కు టాలీవుడ్లో ఇంకెవ్వరికీ ఇవ్వనంత పారితోషకాలు ఇవ్వడానికి కంపెనీలు సిద్ధంగా ఉంటాయి. ఇక పవన్ సినిమాల్లో అతను వాడే వస్తువుల్ని.. ఆయుధాల్ని.. వాహనాల్ని వేలానికి పెట్టినా సరే భారీగానే ధర పలుకుతాయి. కానీ పవన్ ఇలాంటి వాటి మీద అస్సలు ఆసక్తి చూపించడు. ఐతే పవన్ కు ఆసక్తి లేకపోయినా సరే.. అతను వాడిన బైకు నాకు కావాల్సిందే అంటూ ఓ స్టార్ హీరో కొనుక్కుని పట్టుకుపోయాడు.

ఆ హీరో మరెవ్వరో కాదు.. కన్నడ సూపర్ స్టార్ సుదీప్. ఇతను పవన్-వెంకీ కాంబినేషన్ లో తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ ?గోపాల గోపాల?ను హిందీలో ?ముకుంద మురారి? పేరుతో రీమేక్ చేస్తున్నాడు. అందులో సుదీప్ కృష్ణుడిగా నటిస్తుంటే.. వెంకీ పాత్రను ఉపేంద్ర చేస్తుండటం విశేషం. ?గోపాల గోపాల?లో వెంకీని కాపాడే సన్నివేశంలో పవన్ హార్లీ డేవిడ్సన్ బైకు నడుపుకుంటూ వస్తాడన్న సంగతి తెలిసిందే. ఆ బైకును భలే స్టైలిష్ గా నడపడం చూసి ముచ్చటపడిన సుదీప్.. తాను కూడా సేమ్ బైక్ మీద సవారీ చేయాలని కోరుకున్నాడు. ఇందుకోసం ?గోపాల గోపాల? యూనిట్ సభ్యుల్ని సంప్రదించి.. ఆ బైకుని రూ.8 లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. నందకిషోర్ దర్శకత్వం వహిస్తున్న ?ముకుంద మురారి? ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

,  ,  ,  ,  ,  ,  ,