Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-May-2016 11:07:28
facebook Twitter Googleplus
Photo

ఏ ముహూర్తాన బ్రహ్మానందానికి ఆయన తల్లితండ్రులు బ్రహ్మానందం అని పేరు పెట్టారో.... ఆనాటి నుంచి ఆయన అందరిని నవ్విస్తూనే ఉన్నారు.నటుడిగా బ్రహ్మానందం ఎన్నో ఉన్నత శిఖరాలను అదిరోహించి గిన్నీస్ బుక్ లోకి కూడా ఎక్కారు. ఇన్నేళ్ల సినీ ప్రస్థానంలో దాదాపు అందరి దర్శకులు - హీరోలతోను సినిమాలు చేసిన మన బ్రహ్మీ... త్వరలో తన ఆటో బయోగ్రఫీతో మన ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే 75శాతం పూర్తయిన ఆటోబయోగ్రఫీలో ఎన్నో విశేషాలను పొందుపరిచారట.

అయితే అందరితోను ఎంతో సరదాగా కలిసిపోయే బ్రహ్మీ తన ఆటోబయోగ్రఫీని మాత్రం సింపుల్ గా లాగించేస్తాడనే వారు ఉన్నారు.ఎందుకంటే అలా రాయక పోతే బ్రహ్మీ తర్వాత తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అయితే ఈ కామెంట్ కు ఏమాత్రం స్కోప్ ఇవ్వకుండా నిర్మాతలు ఎమ్ ఎస్ రెడ్డి - మురారి రాసినట్లుగానే కాస్త వాడిగా వేడిగానే తన బయోగ్రఫీని తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది.

బ్రహ్మానందాన్ని మిత్రమా - సోదరా అంటూ అక్కున చేర్చుకుంటూనే... ఎవరెవరు తనను ఆఫ్ ది స్క్రీన్ టార్చర్ చేసింది ఈ బయోగ్రఫీలో చెప్పబోతున్నాడట. కాంట్రవర్సీలు - విమర్శలతో బ్రహ్మీ ఆటోబయోగ్రఫీ రూపొందుతూ ఉండడంతో దీనిపై చాలామందికి ఆసక్తి ఏర్పడింది. చిన్నతనంలో కమ్మరి కొలిమి దగ్గర తగిలిన వేడితో మొదలు పెట్టి... కష్టపడుతూ పైకెదిగిన విధానాన్ని తన బయోగ్రఫీలో చెప్పబోతున్నాడు.ఇందులో తనపై కొందరు ఎందుకు పనిగట్టుకుని విమర్శలు చేస్తారనే విషయాన్ని కూడా ప్రస్థావించినట్లు తెలుస్తోంది.

బ్రహ్మానందం ఆటోబయోగ్రఫీ గురించి తాజాగా వస్తోన్న వార్తలు... ఇటు పరిశ్రమలోను హీట్ ను పెంచేవిగా ఉన్నాయి.దీనికి తోడు పుస్తకం రాయడం పూర్తయితే... అది ప్రచురణ వరకు వెల్లక ముందే... కాపీలను తమకు ఒకసారిగా పంపించ వలసిందిగా కొందరు సినీ పెద్దలు బ్రహ్మీని కోరినట్లుగా కూడా తెలుస్తోంది.దీన్ని బట్టి ఆ బుక్ కు ఎంతటి క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు.

,  ,  ,  ,  ,