Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Oct-2016 16:10:36
facebook Twitter Googleplus
Photo

ఎప్పుడైతే త్వరలోనే పవన్ కళ్యాణ్ అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందబోయే సినిమాలో హీరో సునీల్ తిరిగి ఒక స్పెషల్ పాత్రను పోషిస్తున్నాడు అనే న్యూస్ బయటకు వచ్చేసిందో.. వెంటనే సునీల్ మీద కొన్ని సెటైర్లు కూడా పడిపోయాయ్. అన్నయ్య చిరంజీవి సినిమాలో అయితే పనిచేయలేదు కాని.. పవన్ కళ్యాణ్ సినిమా అంటే వెంటనే డేట్లు ఇచ్చేశాడా అంటూ చాలామంది పెదవి విరిచారు. అయితే పవన్ సినిమా గురించి ఏమీ చెప్పని సునీల్.. అసలు అన్నయ్య సినిమాను ఎందుకు మిస్సయ్యాడో వివరించాడు.

''నిజానికి ఇప్పుడు 150వ సినిమాలో ఆలి గారు చేస్తున్న అన్నయ్య ఫ్రెండ్ క్యారక్టర్ నేనే చేయాలి. నాక్కూడా ఆ అవకాశం వదులుకోవడం ఇష్టంలేదు. కాని మెగా ఫిలిం డేట్స్ ఎప్పుడు అడిగారో.. సరిగ్గా అప్పుడే ఈడు గోల్డ్ ఏహా సినిమా క్లయమ్యాక్స్ షూట్ ప్లాన్ చేశాం. ఏకంగా 30 మంది కీలకమైన ఆర్టిస్టుల డేట్లన్నీ అప్పుడే ఉన్నాయి. ఒక్కసారి నేను ఈ షూట్ పోస్టుపోన్ చేశానంటే మళ్ళీ అందరి డేట్లను సెట్ చేయడం కష్టమవుతుంది. పైగా నిర్మాతలకు కూడా కోట్లలో నష్టం వస్తుంది. అందుకే 150వ సినిమాలో చేయలేదు. కాని నాకోసం వేరేదైనా పాత్రను ఇవ్వమని అడిగా. ఒక క్యామియో రోల్ పోషిస్తున్నా. వచ్చే నెలలో షూటింగ్ ఉంటుంది'' అంటూ సెలవిచ్చాడు సునీల్.

,  ,  ,  ,  ,  ,  ,  ,