Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Dec-2016 10:51:16
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ హాట్ అండ్ క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.. ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. ఒకే ఏడాది మూడు సూపర్ హిట్స్ తో ఇప్పటికే 2016లో హ్యాట్రిక్ కూడా కొట్టేసింది రకుల్. నాన్నకు ప్రేమతో.. సరైనోడు.. ధృవ మూవీ సక్సెస్ లతో ఈ ఏడాది అత్యధిక హిట్స్ సాధించిన టాలీవుడ్ బ్యూటీ అయిపోయింది. ఇదే ఏడాదిలో హైద్రాబాద్లో రకుల్ ప్రీత్ సొంతిల్లు కొనుక్కున్న సంగతి తెలిసిందే.

ఈ ఇంటి డిజైనింగ్ విషయంలో కూడా చాలానే జాగ్రత్తలు తీసుకుందట రకుల్ ప్రీత్. ముఖ్యంగా ఇంటిలోని చాలా భాగాన్ని.. ముఖ్యంగా లివింగ్ రూమ్ ను సినిమాటిక్ థీమ్ తోనే డిజైన్ చేయించుకుందట రకుల్. ఈ బ్యూటీ ఇంట్లోని ఇంటీరియర్స్ ఏ మూలనుంచి చూసినా అన్నిటిలోనూ సినిమాటిక్ టచ్ తోనే ఉంటాయి. బాలీవుడ్ నుంచి టాప్ మోస్ట్ యాక్టర్స్ అందరి చిత్రాలు.. క్లాసిక్స్ ఫార్మాట్ లో కనిపిస్తాయట. ఇక బెడ్ రూమ్ ను రకుల్ డిజైనింగ్ చేయించిన విధానం అయితే సూపర్ అంటున్నారు.

ఈ ఇంటిలోకి మారకముందు మూడేళ్ల పాటు ఒక స్టార్ హోటల్ లో ఒకే రూమ్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఉంది. అందుకే.. తన సొంతింటిలోని బెడ్ రూమ్ ను సేమ్ టు సేమ్ డిజైన్ చేయించుకుని.. అదే కంఫర్ట్ ను కంటిన్యూ చేస్తోందట రకుల్ ప్రీత్. ఇక బార్ అండ్ స్విమ్మింగ్ పూల్ లు టెర్రస్ మీద ఉంటాయ్. ఇదీ అమ్మడి ఎంజాయ్మెంట్ ప్లేస్ అన్నమాట.

,  ,  ,  ,  ,