Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Jul-2016 11:24:08
facebook Twitter Googleplus
Photo

కమెడియన్‌గా సూపర్ స్టార్‌డమ్ సంపాదించుకున్న సునీల్, ఆ తర్వాత హీరోగా మారి సినిమాలు చేస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. కొద్దికాలంగా ఆయన హీరోగా నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద నిలబడలేక ఆయన హీరో కెరీర్‌ను అయోమయంలో పడేశాయి. దీంతో మళ్ళీ ఎలాగైనా ఓ మంచి హిట్ కొట్టాలని సునీల్ ప్రస్తుతం ?జక్కన్న? అనే సినిమాతో వచ్చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకున్న ఈ సినిమా రేపు (జూలై 29న) విడుదలకు సిద్ధమైంది.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడుతూ, తననుంచి అందరూ కోరుకునే కామెడీనే ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని సునీల్ స్పష్టం చేశారు. హీరోగా మారాక కెరీర్‌లో కొన్ని హీరో ఓరొయంటర్ కమర్షియల్ సినిమాలు తీశానని, కానీ తననుంచి అందరూ కామెడీ కోరుకుంటూ ఉండడంతో ఈసారి అలాంటి సినిమానే చేశానని తెలిపారు. జక్కన్నతో తనకు కచ్చితంగా ఓ మంచి హిట్ వస్తుందన్న ఆశాభావం సునీల్ వ్యక్తం చేస్తూ వస్తున్నారు. వంశీ కృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో తెరకెక్కిన ?జక్కన్న? సినిమాను సుదర్శన్ రెడ్డి నిర్మించారు. సునీల్ సరసన మన్నారా చోప్రా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించారు.

,  ,  ,  ,  ,  ,