Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Jun-2016 14:42:01
facebook Twitter Googleplus
Photo

కమెడియన్లు హీరోలు కావడం కొత్తేమీ కాదు. సునీల్ కంటే ముందూ అలాంటి వాళ్లున్నారు. తర్వాతా ఉన్నారు. కానీ సునీల్ లాగా ?హీరోయిజం? మత్తు పట్టేసిన కమెడియన్ మాత్రం ఇంకొకరు కనిపించరు. ఏదో ?పూలరంగడు? సినిమా బాగా ఆడేసినంత మాత్రాన.. రెగ్యులర్ మాస్ హీరోల తరహాలో ఫైట్లేంటో.. డ్యాన్సులేంటో.. హీరోయిజమేంటో.. సిక్స్ ప్యాకులేంటో.. జనాలకు అర్థం కావడం లేదు. సునీల్ ను రొటీన్ సినిమాల్లో.. రెగ్యులర్ మాస్ హీరోల వేషాల్లో చూడలేమని మిస్టర్ పెళ్లికొడుకు.. భీమవరం బుల్లోడు.. లేటెస్టుగా కృష్ణాష్టమి.. ఈ మూడు సినిమాలతోనూ గట్టిగానే నొక్కి చెప్పారు తెలుగు ప్రేక్షకులు.

కానీ సునీల్ లో మాత్రం ఏ మార్పూ కనిపించకపోవడం.. వరుసగా దెబ్బ మీద దెబ్బ తాకుతున్నా తాను మారనంటే మారనని భీష్మించుకుని రొడ్డకొట్టుడు వేషాలే వేస్తుండటం ఆశ్చర్యకరమైన విషయం. తాజాగా ?జక్కన్న? టీజర్ చూసిన వాళ్లందరికీ ఎంత అసహనం కలిగి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సునీల్ ను ఒకప్పుడు కమెడియన్ గా ఎంతో అభిమానించిన వాళ్లయితే మరింతగా ఫ్రస్టేట్ అయిపోతున్నారు. సునీల్ ఈ మాట ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా.. అతణ్ని అభిమానించేవాళ్లు ఇప్పటికీ కమెడియన్ గానే చూడాలనుకుంటున్నారు. అతను హీరోగా కొనసాగడమే మెజారిటీ జనాలకు ఇష్టం లేదన్నది వాస్తవం. ఐతే హీరోగా కంటిన్యూ అయితే అవనివ్వండి. కానీ అందాలరాముడు.. మర్యాదరామన్న టైపులో తన కామెడీ ఇమేజ్ కు తగ్గట్లు సినిమాలు చేసుకోకుండా ఈ రెగులర్ మాస్ మసాలా సినిమాల వెంట ఎందుకు పడుతున్నాడో.. తన డ్యాన్సింగ్.. ఫైట్స్.. సిక్స్ ప్యాక్ టాలెంట్లు చూపించడానికి ఎందుకంత తపించి పోతున్నాడో అర్థం కాని విషయం.

అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టార్ హీరోలు సైతం రొటీన్ మాస్ సినిమాల జోలికి వెళ్లట్లేదు. వెళ్లినా దారుణమైన ఫలితాలు ఎదురవుతున్నాయి. ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారిప్పుడు. ఏదైనా కొత్తగా ట్రై చేస్తే తప్ప ఫలితం ఉండట్లేదు. సునీల్ హీరోగా కంటిన్యూ కావడం మీదే అభ్యంతరాలుంటే.. ఇక ఔట్ డేటెడ్ మాస్ వేషాలు వేస్తే జనాలకు అతడి మీద ఇప్పటికే ఉన్న వ్యతిరేకత మరింత పెరగడం తప్ప మరేమీ ప్రయోజనం ఉండదు. సునీల్ ఆప్తమిత్రుడైన త్రివిక్రమ్ అయినా అతడికీ విషయంలో కొంచెం హితబోధ చేస్తే బెటరేమో.

,  ,  ,  ,  ,  ,