Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Oct-2016 11:01:36
facebook Twitter Googleplus
Photo

సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సునీత ఏ స్థాయి ఫాలోయింగ్ సంపాదించుకున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎప్పట్నుంచో ఆమె నటిగా అవతరిస్తారని ప్రచారం వినిపించగా, ఈమధ్యే ?రాగం? అనే షార్ట్ ఫిల్మ్‌తో అది నిజమైంది. శ్రీ చైతూ దర్శకత్వంలో రూపొందిన ఈ షార్ట్ ఫిల్మ్ గత వారమే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. పెళ్ళై భర్తకు దూరంగా ఉన్న ఒంటరి మహిళ ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా చూరగొంటూ వెళుతోంది. ప్రధాన పాత్రలో నటించిన సునీత ప్రతిభ, దర్శకురాలు చైతూ ఒక రియలిస్టిక్ కథను ఎంతో సున్నితంగా చెప్పిన విధానానికి మంచి స్పందన వస్తోంది.
విడుదలై వారం రోజులు కూడా కాకముందే యూట్యూబ్‌లో ఈ షార్ట్ ఫిల్మ్ 5 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. షార్ట్ ఫిల్మ్ అయినా కూడా నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీ పడకపోవడం క్వాలిటీ అవుట్‌పుట్ తేవడంలో దోహదపడిందని రాగం చూస్తే స్పష్టమవుతూనే ఉంది. ఇక తమ షార్ట్ ఫిల్మ్‌కు ఈ స్థాయి ఆదరణ చూపిస్తోన్న ప్రేక్షకులకు దర్శకురాలు చైతూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

,  ,  ,  ,  ,  ,  ,