Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-May-2017 10:21:26
facebook Twitter Googleplus
Photo

దేవుడు శాసిస్తాడు.. అరుణాచలం పాటిస్తాడు అనే రజినీకాంత్ డైలాగ్ ఎంత ఫేమస్సో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు తన రాజకీయ అరంగేట్రం గురించి అడిగిన వాళ్లకు కూడా ఇలాంటి డైలాగుతోనే సమాధానం చెప్పాడు రజినీ. దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తానేమో అంటూ నర్మగర్భమైన వ్యాఖ్యలతో తన రాజకీయారంగేట్రం కోసం చూస్తున్న అభిమానుల్లో కొంత ఉత్సాహం తెస్తూనే.. వాళ్లను అయోమయానికి కూడా గురి చేశాడో రజినీకాంత్. ఆయన మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలో జనాలకు అర్థం కావడం లేదు. రజినీ రాజకీయాల్లోకి రావడానికి ఇంతకంటే మంచి తరుణం మరొకటి లేదని.. తమిళనాట రాజకీయ శూన్యతను సృష్టించడం ద్వారా రజినీని రాజకీయాల్లోకి వెళ్లమంటూ దేవుడు ఇప్పటికే ఆదేశించాడని.. ఇంకా దేవుడి ఆదేశాల కోసం మీన మేషాలు లెక్కించాల్సిన అవసరం లేదని అంటున్నారు అభిమానులు.

రజినీ రాజకీయాల్లోకి రావడానికి అత్యంత అనుకూల వాతావరణం ప్రస్తుతం తమిళనాట ఉందని.. ఆయన ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు అభిమానులు. మామూలుగా రజినీ లాంటి స్టార్ హీరో సినిమాలు మానేస్తానంటే అభిమానులు నొచ్చుకుంటారు కానీ.. ఇప్పుడు సినిమాలు పక్కన పెట్టేసి రాజకీయాల్లోకి వచ్చేసినా అభ్యంతరం లేదన్నట్లుగా ఫ్యాన్స్ స్పందిస్తుండటం విశేషం. రజినీ కొత్త సినిమా ఏదైనా మొదలుపెడుతుంటే దాని గురించే చర్చలు నడుస్తుంటాయి కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పా.రంజిత్ దర్శకత్వంలో మొదలుపెట్టబోయే సినిమా గురించి డిస్కషనే లేదు. అందరిదీ ఒకటే మాట.. రజినీ రాజకీయాల్లోకి వచ్చేయాలి. తమిళనాడు బాధ్యతలు తీసుకోవాలి. ఎంజీఆర్.. జయలలితలను మరిపించే పాలన అందించాలి. కానీ రజినీ మాత్రం వెంటనే రాజకీయాల్లోకి వచ్చేంత ఉత్సాహంతో కనిపించట్లేదు.

,  ,  ,  ,  ,