Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Apr-2016 12:19:43
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ రజనీకాంత్... కమల్ హాసన్ తరువాత తెలుగులో అంత క్రేజ్ సంపాదించుకున్న హీరోలు ఎవరైనా వున్నారా అంటే.. చటుక్కున్న చెప్పే సమాధానం ఆ ఇద్దరి యంగ్ హీరోల పేర్లే. కోలీవుడ్లో ఇప్పుడున్న యంగ్ జనరేషన్ హీరోల్లో వారిదే టాలీవుడ్లో పైచేయి. ఆ ఇద్దరు ఎవరో కాదు... సూర్య - కార్తీ. వీరిద్దరూ తెలుగులో మంచి మార్కెట్టునే సంపాదించుకున్నారు. ఇటీవల విడుదలైన ఊపిరి సిినిమాతో కార్తీకి కూడా క్రేజ్ పెరిగింది. అంతకు ముందు గజని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన సూర్య... ఆ తరువాత వచ్చిన ప్రతి సినిమాతోనూ టాలీవుడ్లో అభిమానులను సంపాదించుకున్నాడు. సెవెన్త్ సెన్స్ తో మరింత క్రేజ్ ను పెంచుకుని టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాడు. అలాంటి హీరో చేస్తున్న వైవిధ్యమైన చిత్రం ?24?. టాలీవుడ్ కు చెందిన విక్రమ్ కె.కుమార్ ఈ చిత్రానికి డైరెక్టర్ కావడంతో... ఈ చిత్రంపై టాలీవుడ్ లో భారీ అంచనాలే వున్నాయి. ఎందుకంటే.. అక్కినేని కుటుంబంతో ?మనం? తీసి అగ్రదర్శకుల జాబితాలో చేరిపోయాడు. ఇలాంటి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై సాధారణంగానే మంచి అంచనాలుంటాయి.

వాటిని నిజం చేసింది మొన్న జరిగిన ?24? ఆడియో ఫంక్షన్. సాధారణంగా తమిళ హీరోల సినిమాలన్నీ తెలుగులోకి అనువాదం అవుతాయి. దాంతో ఈ చిత్రాల ఆడియో ఫంక్షన్ లను లిమిటెడ్ గా ఏ స్టార్ హోటల్లోనో నిర్వహించేస్తారు. ఎందుకంటే... క్రౌడ్ తక్కువగా వస్తారనే కారణం. అలాంటిది సూర్య సినిమాను తెలుగు సినిమా ఆడియో ఫంక్షన్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో శిల్పకళావేదికలో నిర్వహించారు. ఊహించని స్థాయిలో ఈ ఫంక్షన్ కు సినీ అభిమానులు హాజరయ్యారు. ఈ క్రౌడ్ ను చూసిన వారంతా.. నో డౌట్... తెలుగులో సూర్య కూడా క్రౌడ్ పుల్లరే అని అనడం మొదలెట్టేశారు. అంత భారీ ఫంక్షన్ హాల్ ను క్రౌడ్ తో నింపడం అంటే మామూలు విషయం కాదు. సాధారణంగా తెలుగులో బడా హీరోల ఫంక్షన్లు మాత్రమే అక్కడ జరుగుతాయి. అలాంటిది.. సూర్య సినిమా ఆడియో ఫంక్షన్ కు అంత పెద్ద ఎత్తున జనాలు రావడం మామూలు విషయం కాదు అంటున్నారు నిర్వాహకులు. ఇదో సైన్స్ ఫిక్షన్ సినిమా కావడంతోనే... ఈ చిత్రంపై మొదటి నుంచి అంత పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది అంటున్నారు. ఏమైనా సూర్య ఈ సినిమాతో తెలుగులో ఇక నిలదొక్కోవడం ఖాయం అంటున్నారు. మరి సూర్య ఎప్పుడు చెబుతున్నట్టుగా... తెలుగులో స్ట్రెయిట్ సినిమాను త్వరలోనైనా చేస్తాడేమో చూడాలి.

,  ,  ,  ,  ,