Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Jul-2015 17:28:20
facebook Twitter Googleplus
Photo

?బాహుబలి? సినిమాలో చాలా విశేషాలున్నాయి. అందులో కాలకేయుడి క్యారెక్టర్ కూడా ఒకటి. ఈ క్యారెక్టర్లో ప్రభాకర్ నటన అతడి భాష అవతారం అన్నీ కూడా ప్రేక్షకులకు భలేగా నచ్చాయి. ఈ సినిమాతో ప్రభాకర్ అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించాడు. ఐతే ఓ ఐదేళ్లు వెనక్కి వెళ్తే తానొక జీరో అని.. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన ఘనత రాజమౌళిదేనంటూ ఉద్వేగంగా చెప్పుకొచ్చాడు ప్రభాకర్. టాలీవుడ్లో అతడి ప్రస్థానం ఎలా మొదలైందో.. ఈ స్థాయికి అతనెలా వచ్చాడో తన మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

??నాకు తెలిసిన ఒకాయన తనకు హోం మంత్రి తెలుసని.. పోలీస్ జాబ్ ఇప్పిస్తానని చెబితే చాలా ఏళ్ల కిందట హైదరాబాద్ వచ్చా. చేతిలో ఉన్న డబ్బంతా ఆయనకిచ్చా. కానీ ఇదిగో ఇదిగో అంటూనే ఏళ్లు గడిపేశాడు. ఆరేళ్లు హైదరాబాద్లో ఉన్నా జాబ్ రాలేదు. ఆయన ఆరేళ్ల తర్వాత కూడా కొంచెం లేటవుతుంది.. జాబ్ వస్తుందనే చెప్పాడు. ఊరికెళ్తే అందరూ ఏం చేస్తున్నావని అడిగేవాళ్లు. అలాంటి సమయంలో ఒక ఫ్రెండు ద్వారా సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలు వచ్చాయి.

ఐతే అవేవీ చెప్పుకోదగ్గవి కాదు. విలన్ బ్యాచ్ లో ఒకడిగా.. బాడీ గార్డుగా.. ఇలా చిన్న చిన్న క్యారెక్టర్లలో కనిపించే వాడిని. ఐతే సినిమా వాళ్లను చూడొచ్చని.. ఏవో నాలుగు డబ్బులు వస్తున్నాయి కదా అని అలాగే కొనసాగాను. ఓసారి మగధీర షూటింగ్ కు వెళ్తే నన్ను అనుకోకుండా రాజమౌళి చూశారు. నా దగ్గర నిలబడి కొన్ని క్షణాలు అలా పరిశీలనగా చూశారు. నన్నెందుకు అలా చూశాడా అనుకుంటుంటే పక్కనున్నవాళ్లు లైట్ తీస్కో ఏమీ ఉండదన్నారు. కానీ మరుసటి రోజు రాజమౌళి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. రమ్మంటే వెళ్లాను. రాజమౌళి పిలిచి.. నా సినిమాలో క్యారెక్టర్ ఇస్తున్నట్లు చెప్పారు. నాకు నటన రాదని ఒక్క మాటలో చెప్పేశా. కానీ ?నేను చేయించుకుంటా పర్లేదు? అన్నారు. దేవదాస్ కనకాల గారి దగ్గరికి నటనలో శిక్షణకు పంపారు. జిమ్ లో చేర్చారు. అన్నిటికీ ఆయనే డబ్బులు కట్టారు. నా నెల ఖర్చెంతో అడిగారు. నేను వెయ్యి రూపాయలని చెప్పాను.

అప్పట్లో రూంలో చాలామందితో కలిసి ఉండేవాణ్ని. నాకు వెయ్యి రూపాయలే ఖర్చయ్యేది. రాజమౌళి నవ్వేసి వెయ్యి రూపాయలెలా సరిపోతాయి అన్నారు. నాకే అలవాట్లు లేవని వెయ్యి రూపాయలు సరిపోతాయని చెప్పా. నెలకు పదివేలు తీసుకోమన్నారు. మర్యాద రామన్న సినిమా కీలకమైన పాత్ర ఇచ్చారు. ఆ సమయంలో నాకు ఏమీ తెలియదు. చాలా టెన్షన్ పడేవాణ్ని. కానీ రాజమౌళి సార్ కూల్ గా నాకన్నీ నేర్పించారు. ఆయన నెలకు పది వేలు తీసుకోమన్నా.. నేను మాత్రం ఎప్పుడూ ఐదు వేలకు మించి తీసుకోలేదు. అప్పటికదే నాకు చాలా ఎక్కువ. దేవుడు అన్నీ తాను చూసుకోలేక.. తన రూపంలో కొందరు వ్యక్తుల్ని సాయం చేయడానికి పంపిస్తాడంటారు. నా వరకు రాజమౌళి అలాంటి వాడే. దేవుడే?? అంటూ ఉద్వేగంగా చెప్పాడు ప్రభాకర్.

,  ,  ,